ప్రపంచంలోనే అధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతున్న దేశాలు..

Divya
ప్లాస్టిక్..ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ఎక్కడ చూసిన ఈ ప్లాస్టిక్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ప్లాస్టిక్ కారణంగా మనుషులకే కాకుండా భూప్రపంచం మీద ఉన్న ఎన్నో జీవరాశులకు హాని కలుగుతోంది. ప్లాస్టిక్ అనేది కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచినా కూడా భూమిలో కరిగిపోదు. అలా  కరిగిపోకుండా కుప్పలుతెప్పలుగా పేరుకు పోయి జీవరాశికి హానిని చేకూరుస్తోంది. ముఖ్యంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని అరికడుతున్నప్పటికీ, ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు రహస్యంగా అయినా సరే ఈ ప్లాస్టిక్ వాడకాన్ని ఎక్కువ చేస్తున్నారు. తద్వారా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అవడం వల్ల పర్యావరణ కాలుష్యం కూడా అధికంగా పెరుగుతుంది.ఫలితంగా  వర్షాలు పడక పోవడం, పంటలు పండక పోవడం తద్వారా జీవన రాశి కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఎక్కువ.

అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రపంచంలోని ఈ రెండు దేశాల నుండి సుమారుగా ప్లాస్టిక్ వ్యర్థాలు బయటకు వస్తున్నాయని, ఇటీవల జరిగిన అధ్యయనం ద్వారా వెల్లడైంది. అయితే ఆ రెండు దేశాలు ఏవేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవల జరిగిన ఒక కొత్త పరిశోధనలో ఇతర అతి ముఖ్యమైన దేశాలతో పోల్చుకుంటే యూఎస్ అలాగే యూకే దేశాలు మాత్రమే ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా లోనే ఈ ప్లాస్టిక్ ఉపయోగం ఎక్కువగా ఉందని , వీరే ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలను సృష్టిస్తున్నారని కూడా అధ్యయనంలో తేలింది. ఈ దేశంలోని పౌరులంతా ఈ ప్లాస్టిక్ లను మహాసముద్రాలలో కలిపి వేస్తున్నారట.తద్వారా నీరు కూడా కాలుష్యం అవుతోంది అని పరిశోధనలు చెబుతున్నాయి..

తాజాగా 2016 వ సంవత్సరం నుండి వచ్చిన డేటా ప్రకారం అమెరికాలో రీసైక్లింగ్ చేయడం కోసం సేకరించిన ప్లాస్టిక్ లో సగానికిపైగా ప్లాస్టిక్ విదేశాలకు రవాణా చేయబడుతోంది. అంతేకాదు యు.ఎస్.లో సంవత్సరానికి సగటున ఒక మనిషి 105 కేజీల ప్లాస్టిక్ ను  వృధాగా పడేస్తున్నారట. ప్రపంచంలో  ప్లాస్టిక్ కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించటానికి యూఎస్ చాలా పెద్ద పాత్ర పోషించాల్సి ఉంటుంది అని పలువురు పెద్దలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. యూ. ఎస్. తర్వాత యూ కె లో సగటున ఒక వ్యక్తి 99 కేజీల ప్లాస్టిక్ ను వృధా చేస్తున్నారట. ఇకనైనా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, సహజ పద్ధతుల్లో జీవనం సాగిస్తే మంచిది అంటున్నారు నిపుణులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: