హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న చెప్పిన ’బొక్క’ నిజమవుతోందా ?

Vijaya

అవును టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చున్నాయుడు జోస్యమే నిజమయ్యేట్లుంది. ఓ ప్రైవేటు సంభాషణల్లో ఎవరితోనో మాట్లాడుతు ’17వ తేదీ తర్వాత పార్టీకి భవిష్యత్తు లేదు బొక్కా లేద’ని మనసులోని మాటను బయటపెట్టారు. అచ్చెన్న  వ్యాఖ్యల వీడియో ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అచ్చెన్న చెప్పినట్లే ఉపఎన్నిక పోలింగ్ అయిపోయింది. పోలింగ్ లో 2019 ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ జరిగింది. అయితే తాజాగా జరిగిన పోలింగ్ లో ఓవరాలుగా 64 శాతం నమోదైంది. తిరుపతి అసెంబ్లీ పరిధిలో 50 శాతమే రికార్డయ్యింది. 2019 ఎన్నికలకు, తాజా పోలింగుకు మధ్య 16 శాతం ఓటింగ్ పడిపోయింది. అంటే టీడీపీ ఓటింగ్ కు అచ్చెన్న చెప్పినట్లుగా 16 శాతం ఓటింగ్ బొక్కపడినట్లే అనుకోవాలి. మొత్తం పడిన ఓట్లే 11 లక్షలు. ఇందులో టీడీపీకి ఎన్నిఓట్లు పడ్డాయనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే.




ఓవరాలుగా టీడీపీకి బొక్కపడిందన్నదైతే వాస్తవం. అంటే పోలింగ్ సందర్భంగానే బొక్కపడటం మొదలైంది. మరి కౌంటిగ్ సందర్భంగా కానీ మిగిలిన బొక్క సంగతి తేలదు. ఏదేమైనా అచ్చెన్న వ్యాఖ్యల తాలూకు బొక్క ప్రభావం టీడీపీపై బాగానే పడినట్లుంది. ఎందుకంటే సరిగ్గా పోలింగ్ కు మూడు రోజుల ముందు అచ్చెన్న వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి. అసలే ఉపఎన్నికలో  టీడీపీ పరిస్దితి అంతంతమాత్రంగా ఉంది. దానిమీద అచ్చెన్న వ్యాఖ్యలు పుండుమీద కారం రాసినట్లుగా తయారైంది. నేతల్లో చాలామందికి  అభ్యర్ధి పనబాక లక్ష్మి గెలుపుమీద నమ్మకంలేదు. కాకపోతే ఏదో ఫైట్ ఇవ్వాలి కాబట్టి, పనబాక పోటీకి దిగారంతే. అదికూడా చంద్రబాబునాయుడు బలవంతంగా దింపితే ఇష్టంలేకపోయినా దిగాల్సొచ్చింది.



ఇలాంటి పరిస్దితుల్లో స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నే పార్టీకి భవిష్యత్తు లేదని కామెంట్ చేసిన తర్వాత నేతల్లో ఎంతమంది కష్టపడుంటారు ? అప్పటివరకు పార్టీ గెలుపుకోసం అంతో ఇంతో కష్టపడిన నేతలు కూడా డీలా పడిపోయుంటారనటంలో సందేహంలేదు. ఈ విధంగా పార్టీ భవిష్యత్తుపై  అచ్చెన్న జోస్యంలో ఒకటి నిజమైపోయింది. ఇక రెండోది కూడా కౌంటింగ్ లో తేలిపోతే అప్పుడు సంపూర్ణంగా నిజమైనట్లు లెక్క. టీడీపీ నేతల అంచనా ప్రకారమే పార్టీకి వచ్చే ఓట్లు 2.5-3 లక్షలకు మించదు. అంటే దాదాపు 1.94 లక్షల ఓట్లు బొక్కపడినట్లే. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీకి 4.94 లక్షల ఓట్లొచ్చాయి. కాబట్టి అచ్చెన్న చెప్పిన బొక్కజోస్యం నిజమవబోతున్నట్లే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: