హెరాల్డ్ సెటైర్: చూస్తూ చూస్తూ రేవంత్ కి అన్యాయం చెసేసారే...?

Gullapally Venkatesh
తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే విషయంలో రేవంత్ రెడ్డి కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేతల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అర్థం కావడం లేదు. రేవంత్ రెడ్డి విషయంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఈ మధ్యకాలంలో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. రేవంత్ రెడ్డి కొంతమందికి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్న సరే వాళ్ళు మాత్రం రేవంత్ రెడ్డికి సహకరించే విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారు అనే భావన కూడా రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
తాజాగా రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన ప్రకటన చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేవంత్ రెడ్డిని కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిగా జానారెడ్డి పేరుని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదించడంతో అందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జానారెడ్డి కాంగ్రెస్ పార్టీలో బలమైన నేత కావడం సీనియర్ నేత కూడా కావడంతో ఆయన విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కూడా తీసుకోవాలని భావించారు.
అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా తాను ప్రజల్లో కి వెళ్ళ వచ్చు అని రేవంత్ రెడ్డి భావించిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్న విధంగా పరిస్థితులు కనబడలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో జానారెడ్డి గతంలో ముందుకు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటంతో ఆయన వెనక్కు తగ్గారు. ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు ప్రకటించడంతో భవిష్యత్తులో రేవంత్ రెడ్డి వేసే అడుగులు ఏ విధంగా ఉంటాయి. ఏంటి అంటూ అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: