ఏపీ: జగన్ తెచ్చిన పాలసీ నెవర్ బిఫోర్.. కానీ అలా జరిగితేనే రిస్కు..?
అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలను బడిలో చేర్పించే లాగా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నారు. స్కూల్స్ ను బాగా డెవలప్ చేసి టీచర్లు బాగా పాఠాలు చెప్పే లాగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు అన్ని విధాల ఆర్థిక సహాయం అందజేస్తూ భవిష్యత్ తరాల కోసం బాటలు వేస్తున్నారు. విద్యార్థులు చిన్నతనంలోనే ఇంగ్లీషులో ఇరగదీసేలాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్యాబ్ లు అందజేస్తూ ఎక్కువ ఇన్ఫర్మేషన్ కి యాక్సెస్ పొందేలా చేస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా జగన్ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు.
చంద్రబాబు మాత్రం ఇలాంటి ఒక విప్లవాత్మక మార్పును తీసుకురాలేకపోయారు. జగన్ విద్యార్థులు వృద్ధులు మహిళలు, రోగులు ఇంకా ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నారు. జగన్ భుజాల ఎత్తుకున్న ఇలాంటి మంచి పాలసీని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రిపీట్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికలలో జగన్ గెలిస్తే మాత్రమే ఈ సంక్షేమ పథకాల కాన్సెప్టును వేరే వాళ్ళు అమలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. చంద్రబాబు గెలిస్తే ఎవరూ కూడా ఇలాంటి కార్యక్రమాలను అమలు చేయడానికి ఇష్టపడరు. ఇది చాలా పెద్ద రిస్క్‌కు కారణం అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో ప్రజలెవరికీ కూడా సంక్షేమ పథకాలు లభించే ఛాన్స్ ఉండదు.