గెటప్ శ్రీను రాజు యాదవ్ రిలీజ్ పోస్ట్ పోన్.. ఎందుకంటే..!?

Anilkumar
జబర్దస్త్ షో ద్వారా ఇప్పటికే చాలామంది కమెడియన్స్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయమయ్యారు. వారిలో గెటప్ శ్రీను కూడా ఒకరు. ఇప్పటికే సుడిగాలి సుదీర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నాడు. ఆయనతోపాటు గెటప్ శ్రీను సైతం హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. ఇక ఆయన తాజాగా నటిస్తున్న సినిమా రాజు యాదవ్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ పాటలు విడుదలై సోషల్ మీడియాలో మంచి స్పందనను కనబరిచాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా

 ప్రకటించారు చిత్రబృందం. అందులో భాగంగానే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా రాజు యాదవ్ సినిమాను నిర్మించారు.. అయితే ఇప్పటివరకు విడుదలైన సినిమా అప్డేట్స్ అన్ని సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. రాజు యాదవ్ మే 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్

 ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా విడుదల తేదీ వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఒక అప్డేట్ను గెటప్ శ్రీను స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ తో మళ్ళీ వస్తాను డబల్ ఎనర్జీతో త్వరలోనే కొత్త డేట్ వచ్చేస్తుంది అని గెటప్ శ్రీ నూతన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇకపోతే ఇప్పటికే జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న గెటప్ శ్రీను హీరోగా సక్సెస్ అవుతాడా లేదా అన్నది చూడాలి కమెడియన్గా ఎన్నో అద్భుతమైన స్కిట్స్ చేసి పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాడు గెటప్ శ్రీను..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: