పాయల్ ‘రక్షణ' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!?

Anilkumar
మంగళవారం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పాయల్ రాజ్పుత్ ప్రస్తుతం వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పోతుంది. ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్పుత్ తన అందాల ఆరబోతతో రోజురోజుకీ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రస్తుతం పాయల్ మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది ఇన్వెస్టిగేటివ్ రక్షణ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్

 విడుదలయి సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు చిత్ర బృందం. కాగా పాయల్ రాజ్ మెయిన్ లీడ్ రోల్ లో రానున్న ఈ సినిమా జూన్ 7న విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా పాయల్ రాజ్పుత్ మంగళవారం సినిమాతో ఛాలెంజ్ రోల్ ను కూడా చేయగలను అని ప్రూవ్ చేసింది. తాజాగా ఇప్పుడు అలాంటిదే మరొక సస్పెన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకూర్ నిర్మిస్తున్న ఈ సినిమా

 పాయల్ రాజ్ చేసిన అన్ని సినిమాల కంటే పూర్తిగా విభిన్నంగా ఉంటుంది అని వార్తలు వినబడుతున్నాయి. సీట్ ఎడ్జ్ త్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలు రకాల వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుంది పాయల్.. పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది.. ఈ మూవీలో రోషన్‌, మానస్‌, రాజీవ్ కనకాల, వినోద్ బాల, శివన్నారాయణ తదితరులు నటించారు. హరిప్రియ క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి సంగీతాన్ని అందిస్తున్నారు.. మరి ఇప్పటికే మంగళవారం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న పాయల్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: