జబర్దస్త్ కెవ్వు కార్తీక్ ఇంట్లో తీవ్ర విషాదం..!?

Anilkumar
తెలుగు బుల్లితెరపై నంబర్ వన్ కామెడీ షో గా కొనసాగుతున్న జబర్దస్త్ ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ షో ద్వారా ఎందరో మంది ఆర్టిస్టులుగా పైకి వచ్చారు. ఇక అందులో చాలామంది ఇప్పటికే పెద్ద పెద్ద సెలబ్రిటీలు గా మారారు. అయితే అలాంటి వారిలో కెవ్వు కార్తిక్ కూడా ఒకరు. చాలా ఏళ్లుగా జబర్దస్త్ షోలో కమెడియన్ గా కొనసాగుతున్నాడు కెవ్వు కార్తిక్ .ప్రేక్షకులను అలవోకగా నవ్విస్తున్నాడు. అయితే తాజాగా కెవ్వు కార్తిక్ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. దీనితో ఇప్పుడు బుల్లితెరపై

 తీవ్ర విషాదం నెలకొంది. అసలు విషయం ఏంటంటే.. జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న కెవ్వు కార్తిక్ తల్లి గత కొన్ని ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో బుధవారం నాడు ఆమె కన్నుమూశారు. ఇప్పటికే ఆమె మరణం పై పలువురు బుల్లితెర ప్రముఖులు సంతాపం తెలిపారు. కెవ్వు కార్తిక్ తల్లి గత కొన్ని ఏళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. దాదాపుగా ఐదేళ్లుగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఐదేళ్లుగా చికిత్స పొందుతున్నారు కాబట్టి ఆమె తిరిగి కోలుకుంటారు అని అందరూ

 అనుకున్నారు. కానీ ఊహించని విధంగా బుధవారం నాడు రాత్రి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి ఆమె తుది శ్వాస విడిచారు. గతంలో చాలా సార్లు ఆమె అనారోగ్యం గురించి కెవ్వు కార్తిక్ చెప్పాడు .ఆయన తల్లికి క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ఒకవైపు తల్లికి చికిత్స చేస్తూనే మరొకవైపు ఈవెంట్ షోస్ చేస్తూ బిజీగా అయ్యాడు. అలా కొన్ని నీళ్లు చికిత్స పొందుతూ వస్తున్న తన తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది అని అనుకున్నాడు కానీ తాజాగా తన తల్లి కన్నుమూసిన సంగతిని స్వయంగా కెవ్వు కార్తీక్ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. తన తల్లి మరణ వార్తను కెవ్వు కార్తీక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపాడు. ఈ మేరకు తన ఖాతాలో 'అమ్మ.. గత 5 సంవత్సరాల 2 నెలలుగా కాన్సర్‌పై అలుపెరుగని పోరాటం చేశావు. నీ జీవితం అంతా యుద్ధమే. మమ్మల్ని కన్నావు నాన్నకు తోడుగా కుటుంబాన్ని కష్టపరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడవు. అమ్మ ఈ ఐదేళ్లలో ఎలా ఒంటరిగా పోరాడాలి అని నేర్పావు'  అంటూ ఎమోషనల్ అయ్యాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: