హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ
అయితే త్వరలో ఆంధ్రప్రదేశ్ కి కొత్త ఎన్నికల కమిషనర్ రానున్నారు. అయితే ఆయన ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. దీనికి సంబంధించి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎన్నికల కమిషనర్ తో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎన్నికల కమిషనర్ గా ఎవరు బాధ్యతలు చేపడతారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. త్వరలోనే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముగ్గురి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపగా గవర్నర్ ఎవరిని ఎంపిక చేస్తారు ఏంటి అనేది చూడాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో తెలుగుదేశం పార్టీ కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఏకగ్రీవాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల జోక్యంతో కొంతమంది చెలరేగిపోయారు అని తెలుగుదేశం పార్టీ పదేపదే ఆరోపణలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఎంపీటీసీ, జిల్లా పరిషత్ ఏకగ్రీవాల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకోకపోతే కచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్లి తేల్చుకునే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉందని సమాచారం. దీనికి సంబంధించి చంద్రబాబునాయుడు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.