హెరాల్డ్ సెటైర్ : రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది.. కొత్త ఆరోపణ ఏమిటో తెలుసా ?

Vijaya
హేమిటో చంద్రబాబునాయుడు+ఎల్లోబ్యాచ్ నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రతిరోజు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయాలంటే కుదరదు అని పదే పదే ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయిన విషయం అందరు చూస్తున్నదే. అసలు రాజారెడ్డి రాజ్యాంగం ఏమిటంటే మళ్ళీ ఎవరికీ తెలీదు. అలాగే మధ్య మధ్యలో పులివెందుల పంచాయితి..పులివెందుల పంచాయితి అంటూ చంద్రబాబు, లోకేష్+టీడీపీ నేతలు ఒకటే గోల చేస్తున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం అన్నా, పులివెందుల పంచాయితి అన్నా మామూలు జనాలకు అర్ధంకాకపోయినా యావత్ ఎల్లోబ్యాచ్ పదే పదే చెబుతోంది.సరే రాజారెడ్డి రాజ్యాంగం అని చంద్రబాబు+ఎల్లోబ్యాచ్ పదే పదే చెప్పటంపై మంత్రులు, వైసీపీ నేతలు ఎప్పటికప్పడు కౌంటర్లు ఇస్తునే ఉన్నారు. మంత్రులు ఎంతగా అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నా కావాలనే చంద్రబాబు అండ్ కో మాత్రం అవే ఆరోపణలు, విమర్శలను చేస్తునే ఉన్నారు. అయితే మరి పై రెండు మాటలపై చంద్రబాబుకు విసుగుపుట్టిందేమో. అందుకనే హఠాత్తుగా జగన్ పీనల్ కోడ్ (ఇండియన్ పీనల్ కోడ్) అమలవుతోందా అంటూ తెచ్చుపెట్టుకున్న ఆవేశంతో ఊగిపోతు ప్రశ్నించారు. మరి జగన్ పీనల్ కోడ్ అంటే ఏమిటో మాత్రం చంద్రబాబు వివరించలేదు. ఏదో జగన్ పై బురదచల్లేయాలన్న ఆవేశం తప్ప చంద్రబాబు విచక్షణతో మాట్లాడుతున్నట్లు అనిపించటం లేదు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికారంలో ఉన్నంతకాలం చంద్రబాబుకు చట్టం, రాజ్యాంగం లాంటివి ఏవీ గుర్తుకు రాదు. ఎవరైనా సరే తాను చెప్పినట్లే నడుచుకోవాలని చంద్రబాబు గతంలో అనుకునేవారు. అధికారంలో ఎవరున్నా సరే యావత్ అధికారయంత్రాంగం అంతా తమ కనుసన్నల్లోనే నడుచుకోవాలని అనుకోవటం సహజం. మొన్నటి వరకు చంద్రబాబు ఎలా అనుకున్నారో ఇఫుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే అనుకుంటున్నారు. దాన్నే చంద్రబాబు సహించలేకపోతున్నారు. జగన్ చెలాయిస్తున్న అధికారాలను చూసి చంద్రబాబులో రోజురోజుకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. ఆ ఫ్రస్ట్రేషన్లో నుండి వస్తున్నదే రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాయితి, జగన్ పీనల్ కోడ్ లాంటి పనికిమాలిన ఆరోపణలు. మరి రేపు ఇంకేమి కొత్తగా పుట్టుకొస్తాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: