పవన్: దిమ్మదిరిగే ట్విస్ట్ ఇచ్చిన అంబటి రాయుడు..!

Divya
ప్రముఖ క్రికెట్ గా అంబటి రాయుడు ఇండియన్ క్రికెట్ టీమ్ తరపున ఆడి.. ఆ తర్వాత సుమారుగా కొన్నేళ్లపాటు  ఐపీఎల్ CSK  టీమ్ లో కూడా ఆడారు ఇటీవలే రిటైర్మెంట్ తర్వాత వైసీపీ పార్టీలోకి చేరి ఆ తర్వాత కొద్ది రోజుల్లోకే పార్టీ నుంచి తప్పుకొని మళ్ళీ జనసేన పార్టీలోకి చేరారు .. జనసేన స్టార్ క్యాంపెనర్ జాబితాలో ఉన్న అంబాటి రాయుడు ప్రచారానికి మాత్రం అసలు రావడం లేదు.. దీంతో ఈయన పైన పలు రకాల వింత ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. ఈ విషయం పైన తన ట్విట్టర్లో గట్టిగానే రిప్లై ఇచ్చినట్టుగా సమాచారం.

ముఖ్యంగా జనసేన తీరు పైన ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి.. అంబాటి రాయుడు టీమిండియా ప్లేయర్ గానే కాకుండా సీఎస్కే జట్టు సభ్యుడు లో కూడా ఆడారు.. ఆ తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వాలని వైసిపి పార్టీ నుంచి గుంటూరు పార్లమెంటు సీటుని ఆశించగా అది వర్కౌట్ కాలేదు. గుంటూరు బదులు మచిలీపట్నం టికెట్ ఇస్తామని చెప్పిన వైసీపీ అధినేత అది నచ్చక వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి బయటికి వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి చేరారు.

జనసేన టిడిపి పొత్తులో భాగంగా ఏమైందో తెలియదు కానీ అంబాటి రాయుడు రాజకీయాలకు ప్రస్తుతం అయితే దూరంగానే ఉంటున్నట్టు కనిపిస్తోంది. క్రికెట్ మ్యాచ్ల పైన ఆయన అభిప్రాయాలను తెలుగులో తెలియజేస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలోనే జనసేనకు ప్రచారం చేయకపోవడం పైన పలు రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి.. తాజాగా ఈ విషయం పైన అంబాటి రాయుడు స్పందిస్తూ.. "తాను రావడానికి సిద్ధంగానే ఉన్నానని.. కానీ కార్యచరణ ప్రణాళికలు ఏంటో ఎవరైనా చెప్పగలరా అంటూ ప్రశ్నించారు".. కేవలం జనసేన జెండా పట్టుకుని రోడ్లు తిరగాలంటే ఎలా అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. జనసేనకి అసలు ప్లానింగ్ ఏ లేదని చెప్పకనే చెప్పేశారు అంబాటి రాయుడు. జనసేన అధినేత పవన్ తీరు అంబాటి రాయుడికి నచ్చలేదని మాత్రం చాలా క్లారిటీగా కనిపిస్తోంది.. కానీ  ఎలక్షన్ సమయం చివరిలో మాత్రం పవన్ కళ్యాణ్ కు రాయుడు  ఈ విధంగా ట్విస్ట్ ఇచ్చాడంట అబ్బా అంటూ పలువురు నేతలు కార్యకర్తలు సైతం వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: