సెటైర్ : అటా ఇటా ? ఎటూ తేల్చుకోలేక ...

రాజకీయాలను క్లారిటీ గా తీసుకోకపోతే ఆ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం చూస్తేనే అర్థమైపోతుంది. రాజకీయాలు ఆషామాషీగా చేస్తే ఆ తర్వాత ఎటువంటి ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇట్టే అర్థమైపోతుంది. రాజకీయాలలో అనుమానాస్పదంగా, పార్ట్ టైం పాలిటిక్స్ మాదిరిగా ఉంటే ప్రజలలో ఎంత చులకన అవుతాము అనేది పవన్ రాజకీయం చూస్తే అర్థమైపోతుంది. అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నా.. ఆయన వ్యవహారశైలి లో ఎటువంటి మార్పు అయితే కనిపించడం లేదు.ఇప్పుడు బీజేపీ వ్యవహారశైలి చూసుకున్నా, పవన్ వ్యవహారశైలి చూసుకున్నా, ఈ అనుమానాలు మాత్రం తీరడం లేదు.అసలు బిజెపి పవన్ విషయంలో ఏం ఆలోచిస్తోందో అర్థం కావడం లేదు. అలాగే బిజెపి విషయం లో పవన్ ఏం ఆలోచిస్తున్నారో అసలు ఈ రెండు పార్టీలు ఏ విధంగా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నాయో ఎవరికీ అంతుపట్టడం లేదు. 




రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచిన సమయంలోనే పరిస్థితి ఇలా ఉంటే , రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రెండు పార్టీలు కలిసి ముందుకు వెళుతున్నా, విడివిడిగానే వ్యవహరిస్తున్న తీరు జన సైనికులకు అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. పవన్ అనుమానాస్పదంగా వ్యవహరిస్తూ వస్తుండడం, రాజకీయాలలో క్లారిటీ లేకుండా ప్రవర్తించడం వంటివి జనసేన వర్గాలకు లోలోపల ఆందోళన కలిగిస్తున్నా, పైకి మాత్రం అంతా బాగానే ఉంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు . 



ఇక పవన్ ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తు కోసమే ప్రయత్నిస్తున్నారు తప్ప , సొంతంగా బలం పెంచుకునే దిశగా అడుగులు మాత్రం వేయలేకపోతుండడం జన సైనికులను నిరాశ నిస్పృహలకు గురి చేస్తోంది. మొదట్లో టిడిపి బిజెపి లతో సఖ్యత గా ఉంటూ అదే పనిగా పొగుడుతూ వచ్చిన సేనాని , ఆ తర్వాత రెండు పార్టీలపై విమర్శలు చేశారు. ఇప్పుడు చూస్తే బీజేపీని పొగిడి మళ్లీ ఆ పార్టీని దూరం పెట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: