ఈమధ్య వైసిపి రెడ్డి గారి పంచ్ లకు అంతే లేకుండా పోయింది. చంద్రబాబు , లోకేష్ అనే పేర్లు వినిపిస్తే చాలు వారిని పొలిటికల్ గా ర్యాగింగ్ చేసేస్తూ, తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు. అదే పనిగా వైసీపీపై విమర్శలు చేస్తూ, అనవసర నిందలు మోపుతూ, జగన్ ను పదేపదే టార్గెట్ చేసుకుంటూ ఉండడం తో రెడ్డిగారికి మండిపోతోంది. అందుకే విమర్శలకు చెక్ పెట్టే విధంగా, నిత్యం ఆయన సోషల్ మీడియా అకౌంట్ లో తండ్రి కొడుకులను ఒక ఆట ఆడేసుకుంటూ, తెగ కంగారు పెట్టిస్తున్నారు. ఈ రెడ్డి గారి పంచులు ఆషామాషీగా ఉండడం లేదు. పరువు తీసి బజారన నిలబెట్టే విధంగా, జనాల్లో చర్చ జరిగే విధంగా , వ్యంగ్యం గా, చిత్ర విచిత్రంగా, తండ్రి కొడుకులను ఒక ఆట ఆడేసుకుంటూ, నానా హైరానా పడే విధంగా చేస్తున్నారు.
ఆయన సోషల్ మీడియా అకౌంట్ లోకి వెళ్లి చూస్తే , మొత్తం తండ్రీకొడుకుల పైనే పంచ్ డైలాగులు పేలుస్తూ, వారి ఆటలు తనవద్ద అన్నట్లుగా రెడ్డి గారు తన ప్రతాపం చూపిస్తున్నారు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ, బాబు గారు వెన్నుపోటు రాజకీయానికి ఇప్పుడు కరోనా కూడా భయపడుతుందని, అందుకే అందరికీ ఇప్పటివరకు కరోనా సోకినా, ఆ లక్షణాలు కనిపించినా, చంద్రబాబుకు మాత్రం శోకలేదంటూ కొత్త సంగతులు ఎన్నో చెప్పుకొస్తున్నాడు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, పప్పు, మాలోకం అంటూ బాబు గారు ఆయన సుపుత్రుడు లోకేష్ బాబును అదేపనిగా విమర్శలు చేస్తున్నారు.
ఎవరితో అయినా పెట్టుకోండి కానీ నాతో కానీ, తమ అధినాయకుడు తో కానీ పెట్టుకోవద్దు అంటూ హెచ్చరిస్తూనే , సోషల్ మీడియా ద్వారా ఈ విధంగా గా పెద్ద యుద్ధమే చేసేస్తున్నాడు. చిన బాబు.. పెద బాబు పరువు తీయడమే ఏకైక లక్ష్యం రెడ్డిగారు సోషల్ మీడియా యుద్ధం సాగిపోతోంది. ఈ రెడ్డిగారి యుద్ధానికి ఇప్పుడప్పుడే పులి స్టాప్ పెట్టేలా కూడా కనిపించడం లేదు. నిత్యం తండ్రీకొడుకులు ఇద్దరినీ రాగింగ్ చేస్తే కానీ రెడ్డి గారికి మనశ్శాంతి ఉండేలా కనిపించడం లేదు.