సెటైర్ : చిరాకు తెప్పిస్తున్న చినబాబు .. విసిగిపోతున్న పెదబాబు ?

జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల్లో సైతం చక్రాలు, బొంగరాలు గిరగిరా తిప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు కు ఇప్పుడు ఏపీ రాజకీయాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. జగన్ తో పడుతున్న తలపోట్లు ఒకవైపు అనుకుంటే, జగన్ కు మించిన స్థాయిలో తన సుపుత్రుడు లోకేశం బాబు తో వస్తున్న తలపోటు అంతా ఇంతా కాదు. లోకేశం బాబు ఇంట్లో పెట్టినా వీధుల్లోకి పంపినా ఎక్కడ ఉన్నా, ప్రతి ఒక్కరూ చంద్రబాబును ఆడుకుంటూనే విమర్శలు చేస్తున్నారు. పక్క పార్టీ వాళ్లు ఎన్ని విమర్శలు చేసినా పెద్దగా బాధ అనిపించేది కాదేమో కానీ, సొంత పార్టీ నాయకులు పెద్ద పెద్దగా విమర్శలు చేస్తుంటే తట్టుకోవడం మాత్రం చాలా కష్టంగానే ఉంది.

అసెంబ్లీలో తన ముందే ఆ కొడాలి నాని, వంశీ వంటి వారు లోకేశం బాబుని నానా రాకలుగా తిట్టిపోస్తున్నా,గొంతు ఎత్తలేని పరిస్థితి. ఇక పార్టీ నుంచి ఎవరైనా బయటకు వెళ్లారు అంటే, తప్పనిసరిగా లోకేశం బాబు ని ఆడిపోసుకోవడం మామూలు అయిపొయింది. అసలు తన తర్వాత తన రాజకీయ వారసుడు లోకేష్ అనే కదా అన్ని రకాలా ట్రైనింగ్ లు ఇస్తున్నా, లోకేశం బాబు లో పెర్ఫార్మెన్స్ పెద్దగా కనిపించడంలేదు. పైగా మరింతగా లోకేశం పై విమర్శలు చేస్తూ మానసికంగా తనకు ఇబ్బంది కలిగిస్తున్నారు అని చంద్రబాబు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు.
మరోపక్క తెలంగాణ సీఎం కేసీఆర్ హాయిగా పరిపాలన చేసుకుంటున్నాడు. ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన కుమారుడు కేటీఆర్ చక్కగా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించేస్తున్నాడు. కానీ తన విషయంలో మాత్రం దేవుడు అన్యాయం చేసాడనే బాధ చంద్రబాబు బాధపడుతున్నాడు. లోకేష్ కు ఎన్ని రకాలుగా ట్రైనింగ్ ఇప్పించినా,  ఎంతగా తీర్చిదిద్దినా, ఆయన నేటి రాజకీయాల్లో సెట్ కాడనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ కనిపించేస్తోంది. ఇప్పుడు తన కొడుకుని తిట్టు పోస్తుంటే తన బాధ ఎవరికి చెప్పుకోవాలి తెలియని పరిస్థితి ఏర్పడింది.
 ఇప్పుడు తనకు మనశ్శాంతి లేకుండా చిన బాబు తలనొప్పులు ఎక్కువయ్యాయని బాధ పడుతుంటే, ఒకపక్క కొడాలి నాని వల్లభనేని వంశీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తూ మనసు గాయపరిచేస్తున్నారనే బాధ ఎక్కువగా కనిపిస్తోంది. అసలు వాళ్లనూ, వీళ్లనూ తిట్టిపోయడం ఎందుకు ? అదే చినబాబే సక్రమంగా ఉండి ఉంటే ఏ తిప్పలు ఉండేవి కాదు కదా అనేది బాబు గారి బాధ .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: