హెరాల్డ్ సెటైర్ : నిజంగానే పచ్చపార్టీ, పచ్చమీడియా అలాగే కోరుకుంటున్నాయా ?

Vijaya
వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి పచ్చపార్టీ, పచ్చమీడియాను దుమ్ము దులిపేశాడు. ట్విట్టర్ వేదికగా ఎంపి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోని ఏ ప్రతిపక్షమూ, మీడియా వ్యవహరించని రీతిలో రాష్ట్రంలో పచ్చమీడియా, పచ్చపార్టీలు ఘోరంగా వ్యవహరిస్తున్నాయంటూ మండిపడ్డాడు. కరోనా వైరస్ లాంటి కష్టకాలంలో ఉన్నపుడు ఏ ప్రభుత్వంపైనా ఏ ప్రతిపక్షమూ వ్యవహరించని రీతిలో ఏపిలో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయంటూ తిట్టిపోశాడు.

వైరస్ వల్ల జనాలు పోతే పోయారు కానీ ప్రభుత్వానికి మాత్రం మంచిపేరు రాకూడదన్నట్లుగా పచ్చపార్టీ, పచ్చమీడియా వ్యవహరిస్తున్నాయంటూ ధ్వజమెత్తాడు. ఎక్కువ పరీక్షలు చేస్తున్నపుడు కేసుల సంఖ్య పెరుగుతాయన్న కనీస జ్ఞానం కూడా వీళ్ళకు లేదంటూ ఎద్దేవా చేశాడు. రాష్ట్రానికి  చంద్రబాబునాయుడు పీడ విరగడయ్యేనాటికి ఖజానాలో ఉన్నది కేవలం రూ. 100 కోట్లు మాత్రమేనని విజయసాయి చెప్పాడు.

కరోనా వైరస్ దెబ్బకు మరో మూడు నెలలు రాష్ట్ర ఆదాయం పెరిగే అవకాశాలు కూడా లేవన్నాడు. అయినా కానీ లాక్ డౌన్ వల్ల జనాలు ఇబ్బందులు పడకూడదని జగన్మోహన్ రెడ్డి అవస్తలు పడుతూ ప్రజలను ఆదుకోవటాన్ని కూడా పచ్చపార్టీ, పచ్చమీడియా సహిచంలేకపోతున్నట్లు మండిపడ్డాడు. వరదలు వస్తాయని ముందుగు తెలిసినా పునరావాస చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వాన్ని తప్పు పట్టినా అర్ధం ఉందని ఎంపి చెప్పాడు.

కానీ కరోనా సమస్య అది కాదని ఎవరికి ఎటువైపు నుండి వస్తుందో కూడా తెలీని వైరస్ విషయంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని పచ్చపార్టీ నేతలు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు ఆరోపించటంలో అర్ధం లేదన్నారు. టిడిపి నేతలు యనలమ, కళాలను విజయసాయిరెడ్డి కాలం చెల్లిన నేతలుగాను ’వరదముంపు’ తరహా ఆరోపణలుగా కొట్టిపడేశాడు.

నిజానికి విజయసాయి అన్నాడని కాదుకానీ మొదటి నుండి చంద్రబాబు అండ్ కో తో పాటు పచ్చమీడియా జగన్ పై చేస్తున్న ఆరోపణలు ఇలాగే ఉంటున్నాయి. వైరస్ సమస్యను జగన్ చాలా తేలిగ్గా తీసుకున్నాడని అందుకనే తీవ్రతను గుర్తించలేకపోతున్నాడని ఒకటే గోల చేస్తున్నారు.  ప్రభుత్వ యంత్రాంగంతో  ప్రతి రోజు సమీక్షలు చేయటం,  లక్షలాది మంది వాలంటీర్లు, ఏఎన్ఎం సిబ్బందిని రంగంలోకి దింపటం, క్వారంటైన్ సెంటర్లు, ఐసొలేషన్ వార్డులపై చేస్తున్న సమీక్షలేవీ పచ్చమీడియా, పచ్చనేతలకు కనబడటం లేదు. కనబడుతున్నా కనబడనట్లే నటిస్తున్న వాళ్ళని ఎవరూ మార్చలేరంతే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: