ఎర్రిపు : నిర్మాతలను కాల్చుకుతింటున్న హీరోయిన్.. ఛీ.. ఛీ.. చివరకు ఆ బిల్లులు కూడా..!
ఒక సినిమాకు ఎంత మంచి కథ రాసుకున్నా.. ఎంత మంచి స్టార్ కాస్ట్ కుదిరినా క్రేజీ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నా సినిమా తీయాలంటే మాత్రం నిర్మాత కావాల్సిందే.. వీళ్లందరినీ మొదట నమ్మేది ఆయనే.. అయితే సాధ్యమైనంత వరకు నిర్మాతను ఎక్కువ ఖర్చు పెట్టించకూడదు అనే ఆలోచన ఉన్న దర్శకులు కొందరైతే.. సినిమా ఓకే అనుకున్న టైమ్ లో ఒక బడ్జెట్ చెప్పి ఆ తర్వాత బడ్జెట్ డబుల్ చేయడం కొందరికి అలవాటే. సినిమా సగం వరకు షూటింగ్ అవుతుంది కాబట్టి దర్శకుడు చెప్పిన మాటని నిర్మాత వినాల్సిందే.
ఇదిలాఉంటే సినిమా నిర్మాణ వ్యయం పెంచేది కేవలం దర్శకులే కాదు హీరో, హీరోయిన్లు కూడా అని తెలుస్తుంది. హీరో హీరోయిన్లకు ఫ్లయిట్ టికెట్స్, హోటల్ బిల్స్ లాంటివి నిర్మాత భరించాల్సిందే. అయితే అందరు ఏమో కాని ఈమధ్య ఒక హీరోయిన్ తన ఖర్చు
లతో నిర్మాతలను భయపెడుతుందని తెలుస్తుంది. కేవలం ఫ్లయిట్ టికెట్స్, హోటల్ బిల్స్ అయితే ఓకే కాని ఆమె ఎక్స్ ట్రా ఫేర్స్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాయట. ఆ హీరోయిన్ ఖర్చు భారీగా చేస్తుందట ఒక్క లంచ్ కే ఏడు వేల రూపాయల దాకా ఖర్చు చేస్తుందట.
అంతేకాదు ఆమె లాండ్రీ బిల్ కూడా నిర్మాతకి పంపించిందట. రీసెంట్ అమ్మడు చేసిన సినిమా టైమ్ లో లాండ్రీ బిల్ 50 వేల రూపాయలు అయ్యిందట అది కూడా నిర్మాతకు పంపించిందట. అప్పట్లో ఇదే హీరోయిన్ కొన్ని పర్సనల్ థింగ్స్ చార్జెస్ కూడా నిర్మాతల నెత్తిన వేస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే హీరోయిన్ లాండ్రీ ఖర్చు నిర్మాతకి తడిసి మోపెడు అయ్యిందని తెలుస్తుంది. ఇంత చేసినా ఆమె ఏమన్నా సూపర్ హిట్ కొడుతుందా అంటే అది లేదు. హీరోయిన్ల కొరత వల్ల ఆమెను తీసుకోక తప్పట్లేదు అలా అని ఆమె పెడుతున్న అదనపు ఖర్చు మోయలేక నిర్మాతలు తలలు పట్టుకున్నారు.