కోహ్లీనా మజాకా.. ఆ రికార్డు కూడా బద్దలైంది?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ క్రికెట్లో రికార్డుల రారాజు అనే పేరు ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ పేరును సార్ధకం చేసే విధంగానే ప్రతి మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ ఆటతీరు ఉంటుంది అని చెప్పాలి. ఇక భారత క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తాను అందరిలా జట్టులోకి వచ్చి పోయే ఆటగాడిని కాదు ఇక ప్రపంచ క్రికెట్లో చరిత్ర సృష్టించే ఆటగాడిని అన్న విషయాన్ని తన ఆట తీరుతో నిరూపించాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే ఎంతోమంది దిగ్గజాలు సాధించిన రికార్డులను  బ్రేక్ చేసి తన పేరును లికించుకున్నాడు అని చెప్పాలి.

 ఇలా ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో అరుదైన రికార్డులను బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ  కూడా రికార్డులు రారాజుగా మారిపోయాడు. అయితే మొన్నటి వరకు మూడేళ్ల పాటు ఫామ్ లేమితో  ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ.. ఇక ఇప్పుడు మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేస్తూ మళ్ళీ సెంచరీల ముత మోగిస్తున్నాడు అని చెప్పాలి. దాదాపు రెండు నెలల కాలంలోనే నాలుగు సెంచరీలు చేసి అదరగొట్టాడు విరాట్ కోహ్లీ. 3 ఫార్మాట్ లలో  కూడా తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు. ఇక మళ్ళీ ప్రపంచ రికార్డుల వేట ప్రారంభించి దూసుకుపోతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు.

 విరాట్ కోహ్లీ చేసిన ఈ సెంచరీ ద్వారా ఎన్నో అరుదైన రికార్డులను బ్రేక్ చేశాడు అని చెప్పాలి. అంతేకాదు స్వదేశంలో వన్డే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా అరుదైన రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ. ఇక 21 సెంచరీలతో ఏకంగా సచిన్ రికార్డును బద్దలు కొట్టేసాడు. గతంలో స్వదేశంలో ఎక్కువ వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా 20 సెంచరీలతో సచిన్ మొదటి స్థానంలో ఉండగా.. ఇటీవల విరాట్ 21 సెంచరీలతో ఈ రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తంగా మూడో వన్డే మ్యాచ్లో 166 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: