వరల్డ్ క్రికెట్లో.. అత్యధిక సెంచరీల హీరోలు వీళ్లే?

praveen
ఇటీవల బంగ్లాదేశ్ టీమ్ ఇండియా మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ ఎన్నో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే వరుసగా రెండు వన్డే మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేక ఓటమి చవిచూసిన టీమ్ ఇండియా మూడో వన్డే మ్యాచ్లో మాత్రం విజయం సాధించి తమ సత్తా ఏంటో చూపించింది అని చెప్పాలి. దీనితో బలహీనమైన బంగ్లాదేశ్ జట్టును ఎంతో చిత్తుగా ఓడించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే టీమిండియా ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన నేపథ్యంలో ఇక మూడో వన్డే మ్యాచ్ ఎన్నో రికార్డులకు వేదికగా మారిపోయింది అని చెప్పాలి.

 ఎందుకంటే యువ ఆటగాడు ఇషాన్ కిషన్ సెంచరీ తో చెలరేగి పోతే ఇక టీమ్ ఇండియాలోనే మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ అదిరిపోయే సెంచరీ చేశాడు అన్న విషయం తెలిసిందే. ఆసియా కప్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టి20 ఫార్మాట్ లో సెంచరీ చేసి ఇక దాదాపు మూడేళ్లుగా సెంచరీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు నిరీక్షణకు తెరదింపాడు విరాట్ కోహ్లీ. అయితే వన్డే ఫార్మాట్లో మాత్రం ఇక ఈ నిరీక్షణ అలాగే ఉండిపోయింది. ఇక  ఇటీవలే వన్డే ఫార్మాట్ లో కూడా సెంచరీ చేసి అదరగొట్టాడు.

 తన కెరియర్ లో 72వ సెంచరీ నమోదు చేశాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్లు ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే ఈ లిస్టులో 72 సెంచరీలతో విరాట్ కోహ్లీ ఎవరికి అందనంత దూరంలో ఉన్నాడు   ఇంగ్లాండ్ మాజీ టెస్ట్ కెప్టెన్ జో రూట్ 44 సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం 44 సెంచరీ చేశాడు. ఇక టీమ్ ఇండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ 41 సెంచరీలు, ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్ స్మిత్ 41 సెంచరీలు, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ 27 సెంచరీలతో ఈ లిస్టులో కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: