ఇంగ్లాండ్ కు ఊహించని దెబ్బ.. మొన్న వరల్డ్ కప్.. అంతలోనే క్లీన్ స్వీప్?

praveen
ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగాఎవరు ఊహించని రీతిలో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లాండు జట్టు విజయోత్సహంలో మునిగిపోయింది అని చెప్పాలి. అయితే ఇంగ్లాండ్ జట్టుకు ఇలా వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన ఆనందం ఎక్కువ రోజులు మిగలలేదు అని చెప్పాలి. ఏ గడ్డపై అయితే ఇంగ్లాండు జట్టు టి20 వరల్డ్ కప్ గెలిచి సత్తా చాటిందో అదే ఆస్ట్రేలియా గడ్డకు ఇటీవల వన్డే సిరీస్ లో ఓటమి చవిచూసింది అని చెప్పాలి. ఏకంగా ప్రపంచ కప్ ఛాంపియన్గా నిలిచిన ఇంగ్లాండుకే ఆస్ట్రేలియా జట్టు సొంత గడ్డపై కోలుకోలేని షాక్ ఇచ్చింది.

 మొన్నటికి మొన్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా స్వదేశీ పరిస్థితులను కూడా వినియోగించుకోలేక పేలవ ప్రదర్శన చేసి ఇక సెమి ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టిన ఆస్ట్రేలియా జట్టు.. ఇక వరల్డ్ కప్ ముగిసిన వెంటనే టైటిల్ గెలిచిన ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో మాత్రం అదరగొట్టింది అని చెప్పాలి.. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ను క్లీన్ చేసేసింది. ఇటీవలే మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఇంగ్లాండ్ విజయ లక్ష్యాన్ని 364 పరుగులుగా నిర్ణయించారు అంపైర్లు.

 ఆ తర్వాత లక్ష్య చేదనకు దిగిన ఇంగ్లాండు జట్టు ఏ దిశలోనూ అటు విజయం వైపు అడుగులు వేయలేదు అని చెప్పాలి. ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా చేతులెత్తేస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జట్టు 31.4 ఓవర్లలోనే 142 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది అని చెప్పాలి. ఇక ఇంగ్లాండ్ జట్టు తరఫున జేసన్ రాయ్ 33 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు అంటే ఇక మిగతా బ్యాట్స్మెన్ల వైఫల్యం ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక అంతకుముందు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో ఓపెనర్  హెడ్ 130 బంతుల్లో 152, డేవిడ్ వార్నర్ 102 బంతుల్లో 106 పరుగులు చేసి అదరగొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: