రోహిత్ కెప్టెన్సీ.. మిథాలీ రాజ్ ఏమందో తెలుసా?

praveen
టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ సారధ్య బాధితులు చేపట్టిన నాటి నుంచి కూడా వరుస విజయాలతో భారత జట్టు దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత జట్టు విన్నింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ అయితే జట్టుకు విజయాలను అందించడంలో ప్రపంచ రికార్డులు కూడా సృష్టిస్తూ ఉన్నాడు. ఇక ఇప్పటివరకు ఈ ఏడాది టి20 లలో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా కూడా రోహిత్ ఇటీవల వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇక అప్పుడు వరల్డ్ కప్ లో కూడా తన కెప్టెన్సీ తో మ్యాజిక్ కొనసాగిస్తూ ఉన్నాడు.

 అయితే ఒక ఆటగాడిగా రోహిత్ శర్మ పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నప్పటికీ అటు మ్యాచ్లు ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో మాత్రం సారధిగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ జట్టు కు విజయం అందించడంలో ఒక కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని కెప్టెన్సీ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ లిస్టులో భారత మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా చేరిపోయారు. ఏకంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ పై ప్రశంసలు కురిపించింది లెజెండరీ ఉమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్.

 ప్రపంచ కప్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వం తీరు ఎంతో బాగుంది. అందులోనూ కొన్ని క్లిష్ట సమయాల్లో తీసుకునే నిర్ణయాలు అయితే మరింత అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించింది.  అయితే కెప్టెన్సీ ని ఇంకా మెరుగ్గా చేయవచ్చు అని వాదించేవారు లేకపోలేదు.. కానీ ఒత్తిడిలో మంచి నిర్ణయాలు తీసుకోవడం అనేది కేవలం కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఒక నిర్ణయం వెనక ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. ప్రపంచ కప్ అంటేనే తీవ్ర ఒత్తిడి. అలాంటప్పుడు జట్టును లక్ష్యం వైపు నడిపించేలా చేయడం కెప్టెన్ బాధ్యత. ఇక టైటిల్ విజేతగా నిలపడంలో కెప్టెన్ దే  కీలకపాత్ర అంటూ మిథాలీ  చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: