ఈ ఏడాది వరల్డ్ కప్ లో.. అసలైన సంచలనాలు ఇవే?

praveen
టి20 వరల్డ్ కప్ కోసం అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తారు. ఎందుకంటే అసలు సిసలైన క్రికెట్ మజా ఇక్కడే దొరుకుతుంది అని భావిస్తూ ఉంటారు. అయితే క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూసినట్లుగానే అటు ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా జరుగుతూ క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన మాజా అందిస్తూ ఉంది. సాధారణంగా వరల్డ్ కప్ ప్రారంభమైంది అంటే చాలు ఇక చాంపియన్ జట్లుగా కొనసాగుతున్న కొన్ని టీంలు మళ్లీ విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తాయని అందరూ అనుకుంటూ ఉంటారు.

 ఇక ప్రతి ఏడాది జరిగే వరల్డ్ కప్ లాగానే ఈ ఏడాది కూడా తమ ప్రత్యర్ధులు పసికూనలు అయితే భారీ తేడాతో విజయం సాధించి ఇక వరల్డ్ కప్ లో ముందడుగు వేస్తాయి అని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఎప్పటి లాగానే వరల్డ్ కప్ లో నామమాత్రంగా పరిగణించే పసికూన జట్లు ఆడామ అంటే ఆడాం అన్నట్లుగా సదాసీదా ప్రదర్శనతో వరుస ఓటమిలతో నిష్క్రమించడం ఖాయం అని భావిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది వరల్డ్ కప్ లో కూడా అందరూ ఇలాగే అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఈ ఏడాది వరల్డ్ కప్ లో ఎన్నో సంచలనాలు నమోదు అవుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు..

 ఇప్పటికే వరల్డ్ కప్ లో పలుమార్లు టైటిల్ విజేతగా నిలిచి విశ్వ విజేతగా ఎంతో హర్షద్వాణాలు అందుకున్న జట్లను సైతం అతి కష్టం మీద క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడి సూపర్ 12 మ్యాచ్లకు అర్హత సాధించిన పసికూన జట్లు ఓడిస్తూ ఉండడం అందరిని అవాక్కేలా చేస్తుంది  ఇలా ఈ ఏడాది వరల్డ్ కప్ లో ఇలాంటి సంచలనాలను చాలానే నమోదు అయ్యాయి. క్వాలిఫైయర్ మ్యాచ్లో భాగంగా మొదటి మ్యాచ్ లోనే ఛాంపియన్ శ్రీలంకపై నమీబియా విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వెస్టిండీస్ పై స్కాట్లాండ్ విజయం సాధించి రెండు సార్ల విశ్వవిజేత అయిన వెస్టిండీస్ ను ఇంటికి పంపించేసింది. ఛాంపియన్ వెస్టిండీస్ పై మరో పసికూన ఐర్లాండ్ కూడా విజయకేతనం ఎగరవేయడం గమనార్హం . ఇటీవల సూపర్ 12లో భాగంగా ఇంగ్లాండ్ పై ఐర్లాండ్ విక్టరీ సాధించింది. నిన్నటికి నిన్న పాకిస్తాన్ పై జింబాబ్వే సంచలన విజయం సాధించింది. ఇవే ఇప్పటివరకు వరల్డ్ కప్ లో సంచలనాలుగా కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: