కోహ్లీని వెనక్కి నెట్టిన రిజ్వాన్.. అరుదైన ఘనత?

praveen
అందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించిన ఆసియా కప్ ఇటీవలే ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఆదివారం రోజున జరిగిన శ్రీలంక పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక జట్టు ఇరవై మూడు పరుగుల తేడాతో విజయం సాధించి ఆరోసారి ఆసియా కప్ ఎగరేసుకుపోయింది అని చెప్పాలి. అయితే ఆసియా కప్లో భాగంగా గత కొంత కాలం నుంచి సరైన ప్రదర్శన చేయని ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన తో టాప్ లేపారు అని చెప్పాలి. అత్యధిక పరుగులు చేసి వికెట్లు తీసిన ఆటగాళ్లలో భారత క్రికెటర్ల ముందు వరుసలో ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఆసియా కప్లో భాగంగా ఈ ఏడాది సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా మాజీ సారథి విరాట్ ఐదు మ్యాచ్ లలో ఐదు ఇన్నింగ్స్ లు ఆడి  92 సగటుతో 277 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క సెంచరీ కూడా ఉండడం గమనార్హం. అయితే ఫైనల్ మ్యాచ్ ముందు వరకు కూడా ఈ ఏడాది ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కానీ ఫైనల్లో మ్యాచ్ లో మంచి ప్రదర్శన కనబరిచిన మహమ్మద్ రిజ్వాన్  విరాట్ కోహ్లీ ని వెనక్కి నెట్టాడూ. 6 మ్యాచ్ లలో ఆరు ఇన్నింగ్స్ లు ఆడి 281 పరుగులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు.

 శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా మొహమ్మద్ రిజ్వాన్ ఈ ఘనత సాధించాడు అని చెప్పాలి. ఇక మొత్తంగా రిజ్వాన్  మూడు హాఫ్ సెంచరీ చేయగా.. విరాట్ కోహ్లీ మాత్రం రెండు హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీ చేశాడు. ఇక ఈ టోర్నీలో కోహ్లీ తప్ప మిగిలిన ఆటగాళ్లు ఎవరూ కూడా సెంచరీ చేయకపోవడం గమనార్హం. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మహమ్మద్ రిజ్వాన్ విరాట్ కోహ్లీ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ ఇబ్రహీం జాద్రాన్ 5 మ్యాచ్లు ఆడి 195 పరుగులు చేసి మూడవ స్థానంలో ఉన్నాడు. శ్రీలంకకు చెందిన రాజపక్స 6 మ్యాచ్ లలో 191 పరుగులు, నిశ్శంక 6 మ్యాచ్లో 175 పరుగులతో తర్వాత స్థానంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: