ఛాన్స్ కొట్టేసిన తిలక్ వర్మ.. వావ్ అంటున్న ఫ్యాన్స్?

praveen
మొన్నటి వరకు టీమిండియాలో తెలుగు కుర్రాళ్లు ఎక్కువగా కనిపించే వాళ్ళు కాదు.. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఎంతో మంది తెలుగు కుర్రాలు అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అవకాశం దక్కించుకుని అదరగొడుతున్నారు అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది యువ ఆటగాళ్లు టీమిండియాలో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉండటం గమనార్హం. ఇలా ఇటీవలి కాలంలో ఐపీఎల్ కారణంగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన తెలుగు ప్లేయర్స్  తెలంగాణకు చెందిన తిలక్ వర్మ, ఆంధ్రప్రదేశ్కు చెందిన కె ఎస్  భరత్ కూడా ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

 ముంబై ఇండియన్స్ జట్టులో చోటు దక్కించుకున్న తిలక్ వర్మ ఈ ఏడాది టాక్ ఆఫ్ ది ఐపీఎల్ గా మారిపోయాడు.  ఒకవైపు ముంబై జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న సమయంలో కూడా తిలక్ వర్మ మాత్రం ఒత్తిడిని చిత్తు చేస్తూ ఎంతో మంచి ప్రదర్శన చేసి తన బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో టాప్ స్కోరర్గా నిలిచాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతనికి తక్కువ సమయంలోనే టీమిండియాలో చోటు దక్కడం ఖాయం అని అందరూ అనుకున్నారు.

 ఇక మరో తెలుగు క్రికెటర్ కె ఎస్  భరత్ కూడా కీపింగ్ లో బ్యాటింగ్  విభాగంలో ఐపీఎల్ లో బాగా రాణించి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు ఇటీవలే ఒక మంచి అవకాశాన్ని అందుకున్నారు. మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్ ఏ జట్టుతో భారత్ ఏ జట్టు తలపడుతుంది. వచ్చేనెల నాలుగు రోజుల చొప్పున మూడు మ్యాచ్లు జరగబోతున్నాయి. సెప్టెంబర్ 1న మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఇద్దరు యువ ఆటగాళ్లు భారత్ ఏ జట్టు తరపున అవకాశం దక్కించుకున్నాడు. ఇక్కడ బాగా రాణించి టీమిండియా లోకి వెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగేందుకు  సిద్ధమవుతున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: