సంజూ శాంసన్ అదుర్స్.. అది అంత తేలిక కాదు?

praveen
నిలకడ లేని కారణంగా టీమిండియాలో చోటు దక్కించుకోలేక పోతున్న సంజూ శాంసన్..  ఇక ఈ ఏడాది మాత్రం అద్భుతంగా పుంజుకున్నాడు అని చెప్పాలి. ఐపీఎల్లో ఒకవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు సారథ్య బాధ్యతలను భుజాన వేసుకుని జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపించడమే కాదు.. ఒక బ్యాట్స్మెన్గా కూడా అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు సంజూ శాంసన్ . కాగా ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు మునుపెన్నడూ లేని విధంగా వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ దూకుడు చూస్తే ఈసారి కప్పు కొట్టడం ఖాయం అని అభిమానులు అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు.

 ఈ క్రమంలోనే సంజూ శాంసన్  కెప్టెన్సీపై ప్రస్తుతం మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సరైన ప్రణాళికలను అమలు చేస్తున్నాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ పై   కేరళ వెటరన్ ఆటగాడు సచిన్ బేబీ  ప్రశంసలు కురిపించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో సంజూ శాంసన్  రాజస్థాన్ రాయల్స్ జట్టును విజయాల బాటలో నడుస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.  ఈ సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

 కాగా సంజూ శాంసన్ కెప్టెన్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్ లో కూడా అదరగొడుతున్నాడు.  ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలో కెప్టెన్ గా వ్యవహరించడం అంత తేలికైన పని కాదు. ఎందుకంటే జట్టు విజయం సాధించినప్పుడు ప్రశంసలు కురిపించిన వాళ్లే ఓటమి చెందితే విమర్శలు గుప్పిస్తూ ఉంటారు అంటూ సచిన్ బేబీ చెప్పుకొచ్చాడు. అలాగే ఐపీఎల్లో కెప్టెన్సీ చాలా ఒత్తిడితో కూడుకున్నది అది ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ జట్టు కెప్టెన్ గా సంజూ శాంసన్ రాణించడం కేరళ జట్టుకు మరింత కలిసొస్తుందని సచిన్ పేర్కొన్నాడు. కాగా దేశవాళీ క్రికెట్లో కేరళ జట్టుకు సంజూ శాంసన్ సచిన్ బేబీ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: