ఆ వీడియో చూసి వచ్చి.. సెంచరీ చేశా : మయాంక్ అగర్వాల్
అయితే ఇక రెండో టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా రాణిస్తాడు అనుకున్న శ్రేయస్ అయ్యర్ తక్కువ పరుగులకే వికెట్ సమర్పించుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం అయ్యాడు. దీంతో టీమిండియా ఒకానొక దశలో కష్టాల్లో పడిపోయింది అని చెప్పాలి. ఆ సమయంలో మైదానంలోకి వచ్చిన యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ అద్భుతంగా రాణించాడు. ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. దీంతో మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ తీరుపై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాను సెంచరీ చేయడం పై మయాంక్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నీ కంట్రోల్ లో ఏదైనా ఉంది అంటే అది నీ బ్యాటింగ్ మాత్రమే నీ బ్యాటింగ్ లో బెస్ట్ ఇవ్వు అంటూ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు.
ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకున్నా అంటూ మయాంక్ అగర్వాల్ చెప్పుకొచ్చాడు. అయితే తాను బ్యాటింగ్ చేయడానికి రావడానికి ముందు గవాస్కర్ బ్యాటింగ్ వీడియోలను చూసాను అంటూ చెప్పుకొచ్చాడు మయాంక్ అగర్వాల్. బ్యాటింగ్ చేసే సమయంలో బ్యాక్ లిఫ్ట్ తగ్గించాలని గవాస్కర్ సూచించారు ఈ క్రమంలో ఇది నేర్చుకోవడానికి గవాస్కర్ వీడియోలు చూశాను తర్వాత ఆయన భుజం ఎలా ఉందో గమనించి బ్యాక్ లిఫ్ట్ తొలగించే ప్రయత్నం చేశాను అంటూ మయాంక్ అగర్వాల్ చెప్పుకొచ్చాడు. ఇలా గవాస్కర్ వీడియోలు చూసి వచ్చి ఇక అలా ట్రై చేసి సెంచరీ చేసినట్లు మయాంక్ అగర్వాల్ తెలిపారు.