హ్యాపీ సండే వీకెండ్ కౌంట‌ర్ : ఓయ‌బ్బో! అత‌నేన‌మ్మ ట్రోలింగ్ బాధితుడు?

RATNA KISHORE

ఈ వారంలో బాగా ట్రోలింగ్ కు గుర‌యిన మంత్రి అనీల్ కుమార్ యాద‌వ్ అనే నెల్లూరు పెద్దాయ‌న. పాపం ఆయ‌న‌కు హీరో నానీ ఎవ్వ‌రో తెలియ‌దు కానీ కొడాలి నానీ అనే బూతుల మంత్రి మాత్రం బాగానే తెలుసు అని స‌వివ‌రంగా విన్నవించుకున్నారు. దీంతో ఆయ‌నంత‌ట ఆయ‌నే కోరి క‌య్యం తెచ్చుకుని జ‌న‌సేన తో ట్రోల్ చేయించుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ ముఖ్య‌మంత్రి ఆదేశాల‌ను పాటించే ఈ భ‌క్త బృంద స‌భ్యుడు త‌గ్గేదేలే అని అంటున్నారు. ఈ త‌రుణంలో ఈ నేప‌థ్యంలో వీకెండ్ కౌంట‌ర్ రాస్తాండాను...

ఏపీ రాజ‌కీయాలు చిత్రంగా ఉన్నాయి. ఉంటాయి కూడా! ఇక‌పై కూడా అలానే ఉంటాయి.. ఉండాలి కూడా! ఎందుకంటే  రాజ‌కీ యంలో ఏ విధం అయిన ఇంట్ర‌స్టింగ్ ఎలిమెంట్ లేక‌పోయినా ఎవ‌రో ఒక‌రు పొలిటిక‌ల్ బ‌ఫూన్ క్యారెక్ట‌ర్ ఒక‌టి ప్లే చేస్తుండాలి. తోలుబొమ్మలాట‌ల్లో కేతిగాడులా ఏదో ఒక‌టి అన‌డం త‌రువాత అనిపించుకోవ‌డం అన్న‌వి చాలా స‌ర‌దాగా సాగిపోతూ ఉండాలి. ఏమీ లేక‌పోతే కిక్కే ఉండ‌దు. అందులో  జ‌గ‌న్ కార్య‌క్ర‌మాలు అన్నీ చాలా పెద్ద‌వి. చాలా డ‌బ్బుకు సంబంధించినవి. ఆయ‌న ఇవ్వా లనుకున్న‌వ‌న్నీ ఇచ్చేస్తూ, చేయాల‌నుకున్న‌వ‌న్నీ చేసేస్తూ జ‌నం క‌ళ్ల‌లో ఆనందం కోసం ఎప్ప‌టిక‌ప్పుడు ఎడాపెడా అప్పులు చేసేస్తూ అప్ప‌టిక‌ప్పుడు సంప‌ద సృష్టిలో ముందుండ‌డం అంటే ఆషామాషీ వ్య‌వ‌హ‌రం కాదు. కానే కాదు.
ఎందుకంటే ఆయ‌న‌కు ఎన్ని సవాళ్లున్నా ఆయ‌న త‌మ్ముడికి..అనుకుంటాను..తెలియ‌దు..అవినాశ్ రెడ్డికి ఎన్ని త‌ల‌నొప్పులున్నా, మ‌రో త‌మ్ముడు మిథున్ రెడ్డికి ఎన్ని త‌ల‌నొప్పులున్నా ఈ రాష్ట్రం అభివృద్ధికి వాళ్లు చేస్తున్న కృషి అన‌న్య సామాన్యం.అనితర సాధ్యం కూడా! ఈ క్ర‌మంలో మ‌రో త‌మ్ముడు త‌ప్పుకు దొరికేశాడు.ఆయ‌నే గ్రేట్ అనీల్ స‌ర్...అయ్యో "డు" అన్నానే డు కాదు రు..దొరికేశారు. అందుకే ఆయ‌న‌ను జ‌న‌సేన కుర్రాళ్లు అదే ప‌నిగా ఏదో ఒక‌టి అంటా ఉన్నారు. ఒక కార్పొరేట‌ర్ స్థాయి
నుంచి ఎదిగిన ఆయ‌న‌కు హీరో నానీ తెలియ‌దు కానీ  మంత్రి కొడాలి నానీ ఒక్క‌రే తెలియును.ఇదొక్క‌టే ఆయ‌న‌కు తెలిసిన స్నేహం..హీరో నానీ మాత్రం తెలిసిన మ‌రియు మ‌న‌సుకు న‌చ్చిన వైరం. అందుకే నానీ ఎవ్వ‌రో ఆయ‌న‌కు తెలియ‌క పోవ‌డం వ‌ల్ల తెలియ‌జెప్పాల‌న్న బాధ్య‌త‌ను జ‌న‌సేన తీసుకుని త‌న‌వంతుగా అడిగిన వారికి, అడ‌గ‌ని వారికి హీరో నాని ఎవ‌రో చెబుతోంది. త‌ద్వారా మంత్రికి కూడా ఈ స‌మాచారం చేర‌వేస్తుంది. అయినా కూడా మంత్రి కి నానీ ఎవ్వ‌రో తెలియ‌డం లేద‌ట‌!

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: