బాబు విషెస్ : జ‌గ‌న్ కు హ్యాపీ ద‌స‌రా !

RATNA KISHORE
బాబు తొమ్మిదేళ్ల సీఎం. జ‌గ‌న్ బాబు నాలుగు నుంచి ఐదేళ్ల పాటు సీఎం. నాలుగు నుంచి ఎంత వ‌ర‌కూ అన్న‌ది తెలియ‌దు క‌నుక అలా రాశాను. ముందస్తు వ‌స్తే ఆ ప‌రిధి ఎలా ఉంటుందో తెలియ‌దు. టైం పీరియ‌డ్ మారినా మారవచ్చు. అయినా కూడా జ‌గ‌న్ మాత్రం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 2023 కు టీంను రెడీ  చేసుకుంటూ హ్యాపీ ద‌స‌రా అని చెప్పారు. అదేవిధంగా బాబు కూడా జ‌గ‌న్ కు విషెస్ చెప్పి, న‌వ్వులు కూడా వాటికి జ‌త చేశారు. ఇప్పుడు ఎవ‌రికి హ్యాపీ?

వ్యంగ్యానికి అయినా ఓ అర్థం ఉంటుంది. ఉండాలి. హ‌ద్దు ఉంటుంది. ఉండాలి కూడా! తెలంగాణ ప్ర‌భుత్వం ఏం చేసినా పాపం అక్క‌డ అడిగేవారు ఎక్కువ‌య్యారు. ఇక్కడ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏం చేసినా అడిగేందుకు పెద్ద‌గా నోళ్లే లేవు. లేకపోయినా ప‌ర్లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డిలా ఇప్పుడు బాబు మాట్లాడాల్సిన ప‌ని లేదు. ఆ మాట‌కు వ‌స్తే నోరేసుకుని ప‌డిపోవాల్సిన ప‌నిలేదు. అందుకే మా ఊరి లీడ‌ర్ అచ్చెన్న పెద్ద‌గా ఈ డ్రై స‌బ్జెక్ట్ పై మాట్లాడ‌డం మానుకున్నారు.

 ఏం మాట్లాడినా స‌రే జ‌గ‌న్ చేయాల్సింది చేస్తున్నారు క‌నుక ఎవ‌రి గొయ్యి వారు త‌వ్వుకోవ‌డ‌మే బెట‌ర్ అని అనుకుంటున్నారు అచ్చెన్న‌. కార్య‌క‌ర్త‌ల‌తోనూ అదే చెబుతున్నారు. ప్ర‌జ‌లంతా చూస్తున్నారు క‌నుక మనం మాట్లాడాల్సిన ప‌నే లేదు. హాయిగా ఆయ‌న త‌న‌ని తాను త‌గ్గించుకుంటూ వ‌స్తున్నారు అని! ఈ ద‌శ‌లోనే బాబూ అనే లీడ‌ర్ జ‌గ‌న్ కు హ్యాపీ ద‌స‌రా అని చెప్పారు. వ‌చ్చే ద‌స‌రాను, ఇంకా వీలుంటే మ‌రో ద‌స‌రా కూడా చేసుకుని అటుపై ఇంటికే ప‌రిమితం అయిపోండ‌న్న‌ది ఆయ‌న భావ‌న కావొచ్చు.

ఏం చేసినా చేయ‌కున్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాదే విజ‌యం అని పాపం జ‌గ‌న్ అంటున్నారు. కాదు మాదే అంటున్నారు టీడీపీ వ‌ర్గీయులు. ఇదే ఇప్పుడు పెద్ద త‌ల‌నొప్పిగా ఉంది. ఓడిపోయే వారంత టీడీపీలోనే ఉన్నార‌న్న‌ది పాపం జ‌గ‌న్ గారి భావ‌న‌. అదే భావ‌నతో ఎంత‌కాలం ఉంటే అంత త‌మ‌కు మంచిది అన్న‌ది వైసీపీ పై టీడీపీ ఆలోచ‌న. విద్యుత్ సంక్షోభం తోనే తాము గ‌ట్టెక్కి పోతామ‌ని టీడీపీ బ‌లంగా చెబుతోంది. అదే విశ్వాసంతో పెద్ద‌గా ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకుంటోంది. జ‌గ‌న్ మాత్రం అదే ప‌నిగా టీడీపీని తిట్ట‌డ‌మే ప‌నిగా మంత్రుల‌కు అసైన్మెంట్లు ఇస్తున్నారు. తిట్ట‌క‌పోతే ఇంపోజిష‌న్లు రాయిస్తున్నారు. గ‌తంలో జ‌గ‌న్ ను ఇలానే తిట్టి టీడీపీ ఇంటికిపోయింది. ఇప్పుడు అదే సూత్రం అనువ‌ర్తింప‌జేసి, జ‌గ‌న్ త్వ‌ర‌లోనే అధికారం నుంచి దూరం కానున్నార‌న్న‌ది ప‌రిశీల‌కుల మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: