తెదేపాలో ఆగస్ట్‌ గుబులు.. ఈసారి లోకేశ్ అరెస్ట్ ..?

Chakravarthi Kalyan
రాజకీయాల్లో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి.. వాటికి ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది.. వీటికి లాజిక్కులతో పని లేదు.. అయినా సెంటిమెంట్ అంటేనే లాజిక్‌ లేకపోవడం కదా.. ఆగస్ట్ వచ్చిందంటే.. తెలుగు దేశం నేతల్లో ఓ టెన్షన్ మొదలవుతుంది. ఈ పార్టీకి మొదటి నుంచి ఆగస్ట్ నెల అంటే.. ఏదో ఒక తలకాయ నొప్పు ఉంటూ వచ్చింది.. అందుకే ఈనెలలో తెలుగు దేశం నేతలు చాలా జాగ్రత్తగా ఉంటారు. మరి అంత టెన్షన్ ఎందుకో ఓసారి పాత జ్ఞాపకాలు నెమరేసుకుందాం..

1984 ఆగస్ట్ లోనే తెలుగు దేశంలో తొలి ప్రకంపనలు మొదలయ్యాయి. అప్పటి ఎన్టీఆర్ సహచరుడు.. ఎన్టీఆర్ వైద్యం కోసం అమెరికా వెళ్లగానే నాదెండ్ల భాస్కర్‌రావు క్యాంప్ రాజకీయాలు నడిపాడు.. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దింపి సీఎం అయ్యాడు. ఆ తర్వాత పోరాటం ద్వారా ఎన్టీఆర్ మళ్లీ పదవి దక్కించుకున్నా ఆగస్టు భయం అలా ఉండిపోయింది. ఇక  1995 లోనూ సేమ్ సీన్ రిపీటైంది. కాకపోతే.. ఈసారి సొంత అల్లుడు చంద్రబాబే ఎన్టీఆర్ సర్కారును కూల్చాడు.

మామను గద్దె నుంచి దింపి తానే సీఎం అయ్యాడు. కానీ.. ఈసారి ఎన్టీఆర్ మళ్లీ పదవి వెనక్కు తిరిగి తెచ్చుకోలేకపోయాడు.. ఆ తర్వాత ఏడాదికే ఆయన కన్నుమూశారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎంగా ఉండగా.. 2000 లో బషీర్ బాగ్ కాల్పుల ఘటన ఈనెలలోనే  జరిగింది. ఈ ఘటన చంద్రబాబు రాజకీయ జీవితాన్నే మార్చేసింది. చంద్రబాబును రైతు వ్యతిరేకిగా చిత్రీకరించింది. 2004లో ఓటమికి పరోక్షంగా కారణమైంది. అందుకే ఆగస్టు నెల అంటేనే టీడీపీ నాయకులకు వణుకు.

అయితే మరి ఇప్పుడు ఏంటి.. ఇప్పుడు కోల్పోటానికి టీడీపీ అధికారంలో లేదు. తెలంగాణలో ఉనికిలోనే లేదు. అయితే.. ఏపీలో జగన్ ప్రభుత్వం టీడీపీ నాయకులను వేటాడుతోంది. ఏ చిన్న కేసు దొరికినా తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నాయకులు వరుసగా అనేక మంది జైలు పాలయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చారనుకోండి.. ఇప్పుడు అదే తరహాలో నారా లోకేశ్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని స్వయంగా టీడీపీ నాయకులే చెబుతున్నారు. మరి ఈ ఆగస్టు నారా లోకేశ్ అరెస్టుకు అవకాశం ఇస్తుందా.. అన్నది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: