మంచిమాట : ఎవరి పని వారు చేస్తేనే అందం.. ఆనందం..!!

Divya
కోసల రాజ్య సైన్యాధిపతికి ఓ గుర్రం ఉండేది. దాన్ని అతడు చాలా బాగా చూసుకునేవాడు. ప్రతి రోజు పచ్చగడ్డి , ఉలవలు తెచ్చిపెట్టి తినిపించేవాడు. దానికోసం ప్రత్యేకంగా ఒక చావిడి కూడా కట్టించాడు. గుర్రానికి ఏ మాత్రం నలతగా ఉన్నా పక్క రాజ్యాల నుండి వైద్యులను పిలిపించి మరీ చికిత్స చేయించి కంటిపాపలా కాపాడుకునేవాడు. కొంతకాలానికి పొరుగు రాజ్యాలు అన్నీ కోసల మిత్ర రాజ్యాలైపోయాయి. ఇక యుద్ధాలు వచ్చే అవకాశమే లేకుండాపోయింది. దీంతో సైన్యాధికారి గుర్రాన్ని నిర్లక్ష్యంగా చూడటం మొదలుపెట్టాడు.

యుద్ధాలు లేనప్పుడు దీనికి ఇంత తిండి దండగ అని రోజుకి ఒక్కపూటే ఆహారం పెట్టేవాడు. దాంతో అది నీరసించిపోయింది. అంతేకాదు దానిపై స్వారీచేయడం మానేసి ఇంటికి అవసరమైన సరుకుల్ని గుర్రంతో తెప్పించే వాడు. అలా ఆ గుర్రాన్ని కాస్త గాడిదలా మార్చేశాడు .. ఓసారి అనుకోని పరిస్థితుల్లో... ఓ మిత్ర రాజ్యం కోసలపై దండెత్తి యుద్ధానికి సిద్ధమని మహారాజు ఆజ్ఞాపించాడు. దాంతో హడావిడిగా ఇంటికొచ్చిన సేనాపతి కార్తిడాలు తీసుకొని గుర్రానికి జీనూ తగిలించి యుద్ధభూమికి బయలు దేరాడు.
 
కొరడాతో ఎంత గట్టిగా కొట్టినా గుర్రం దౌడు తీయకుండా నెమ్మదిగా నడుస్తోంది. ఏమయ్యింది నీకు అంటూ కొరడాతో మరొకటి తగిలించబోయాడు. ఈలోగా గుర్రం నోరువిప్పి అయ్యా... నన్ను క్షమించండి.. నేను బరువులు మోయగలను కానీ యుద్ధానికి పనికిరాను. మీరు నన్ను గాడిదల మార్చేశారు. వాయువేగంతో పరుగుతీయడము శత్రువుల కదలికలను గమనిస్తూ యజమాని ఆదేశాలకు అనుగుణంగా ముందుకు దూకడమూ నాకు నేర్పించలేదు. యుద్దరంగంలో ఎలా ఉండాలనే కనీస శిక్షణ కూడా ఇప్పించ లేదు. .

ఇప్పుడు హఠాత్తుగా యుద్ధం వచ్చిందని పరిగెత్తమంటే నేను ఏం చేయగలను. అంది ఎన్నో నైపుణ్యాలున్న గుర్రంతో వేరే పనులు చేయించాను. ఇప్పుడు అవసరానికి పనికి రాకుండా పోయిందని బాధపడ్డాడు ఆ సేనాపతి. అందుకే గాడిద చేసే పని గాడిద చేయాలి అంటారు.. గుర్రం చేసే పని గుర్రమే చేయాలంటారు.. కాదని వాదిస్తే సమస్యలు తప్పవు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: