మంచిమాట : ప్రవర్తన మంచిదయితే సత్ఫలితం మీదే..!!
" ఎందువల్ల ఆలస్యం అయ్యింది?"అని ప్రశ్నించారు పరీక్ష నిర్వాహకులలో ఒకరు..అయితే ఆ అభ్యర్థి నేను ముందుగానే బయల్దేరాను. ఆలయానికి వచ్చే మార్గం రాళ్లు , రప్పలతో ఉండటం వల్ల రాళ్లు తీసివేసి వస్తున్నాను. దీంతో చాలా సమయం వృధా అయింది. అని చెప్పాడు యువకుడు. అతనీ సమాధానం చూసి పూజారినీ ఎంపిక చేసే సభ్యులకు బాగా నచ్చింది.
"నీకు పూజలు చేయడం వచ్చా?" అని ప్రధాన సభ్యుడు ఆ అభ్యర్తిని అడిగాడు.
నేను నిత్య ప్రార్ధనలు చేస్తాను. విగ్రహాలను శుభ్రం చేయడం , అగరబత్తులు ముట్టించడం.. నైవేద్యం పెట్టడం వంటివి పనులు వచ్చు అని సమాధానం ఇచ్చాడు యువకుడు. అయితే "నీకు వేదమంత్రాలు తెలుసా?" అని మరో సభ్యుడు అడిగాడు."తెలియదు" అని చెప్పాడు యువకుడు.
ఇక ఈ మాటలు విన్న సభ్యులు కాసేపు తమలో తామే ఒకరితో ఒకరు చర్చించుకున్నారు. తర్వాత ఆ యువకుడినే ఆలయ పూజారిగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. ఏ ప్రార్థనైనా నిజమైన భక్తితో చేయబడితే అది వేద మంత్రాలతో సమానం.. వేదమంత్రాలు బోధించే ఏర్పాటు కూడా చేస్తాం. అని యువకుడితో చెప్పారు సభ్యులు. అంటే ఇక్కడ ఆ అభ్యర్థికి ఉద్యోగం రావడానికి గల ముఖ్య కారణం అతని ప్రవర్తన. అతను చెప్పిన సమాధానం ఎలాంటిదైనా సరే అతని ప్రవర్తన చూసిన ఆలయ సభ్యులు ఇంత కంటే ఉత్తమమైన సద్గుణ మైన పూజారిని మరెక్కడా తీసుకురాలేదని అతడికి వేదమంత్రాలు రాకపోయినా సద్గుణం ఉండడం వల్ల ఆలయ పూజారి గా నియమించారు. కాబట్టి మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు సత్ఫలితాలు లభిస్తాయి.