మంచిమాట: మోసానికి మోసమే సరైన పద్ధతి..!!

Divya
చాలాకాలం క్రిందట యమునానదీ తీరంలో ఒక చెట్టు మీద ఒక తెలివైన కోతి నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు కింద నది లో ఒక మొసలి కూడా వుండేది. ఆ మొసలి రుచికరమైన పండ్లను తింటూ ఆనందంగా కోతిని గమనిస్తూ ఉండేది. ఒకరోజు ఆ ముసలి తన భర్తతో అన్ని రకాల చెట్ల నుంచి రుచికరమైన పండ్లన్నీ తింటోంది. నాకు దాని గుండెకాయ తెచ్చి పెట్టగలవా అని అడిగింది. అయ్యో అయ్యో అది సాధ్యం కాదు. అని సమాధానం చెప్పింది ఆ ముసలి భర్త.. అది చెట్ల మీద ఉంటుంది. నేను చెట్లు ఎక్కలేను అని అంటుంది. అప్పుడు ఆడ ముసలి బుద్ధి తక్కువ వాడా ఏ పని స్వతంత్రంగా చేయలేవు అంది.

సరేలే జాగ్రత్తగా విను దీనికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయం గురించి బాగా చర్చించుకున్న తరువాత మొగ ముసలి కోతి దగ్గరకు వెళ్లి ఏవండోయ్ కోతి గారు నాకు నాలుగు మంచి రుచికరమైన పండ్లను ఇవ్వండి అని అడగగా..ఆ కోతి దాందేముంది.. అంటూ పండ్లను ఇచ్చింది. ఇవి అవతల ఒడ్డు లో ఉన్న చెట్టు పండ్లా.. తీయగా లేవు వాటి రుచి నువ్వు చూడాల్సిందే. అవి చాలా రుచిగా ఉంటాయి అని చెప్పింది. అప్పుడు ఆ కోతి అవునా అవి అంత తియ్యగా ఉంటాయా అని కోతి అవతలివైపు చూస్తూ ముసలినీ అడిగింది. నాకు అటు వైపు వెళ్లాలని ఉంది కానీ నేను అవతల ఒడ్డుకు దూకలేను.. ఈద లేను అంటూ కోతి అంది .

ఆ మాటకు ముసలి.. నువ్వేమి బాధపడకు నా వీపు మీద ఎక్కు ఆ మాటకు నేను తీసుకెళ్తా అని అంది ముసలి..కోతి చాలా ఆనందం తో ముసలి వీపు మీదకి దూకింది. నది మధ్య కు చేరిన తరువాత నీళ్ల లోపలికి మరీ లోపలికి పోవటం మొదలు పెట్టింది. అప్పుడు భయపడ్డ కోతి నీటిలోకి ఎందుకు పోతున్నావు. అని అరిచింది. ఇదిగో మిత్రమా.. నేను నిన్ను నా భార్య దగ్గరకు తీసుకు పోతున్నాను. నా భార్య నీ గుండెకాయ ను రుచి చూడాలనుకుంటోంది. అంది మగ ముసలి.. ఆ మాటలకు కోతి నవ్వుకుంటూ ముందుగా చెప్పక పోతివ.. నా గుండెకాయను చెట్టు మీద పెట్టి వచ్చాను. ముందే చెప్పినట్లు అయితే దాన్ని ఆనందంగా నీకు ఇచ్చేదాన్ని అని అంది.. దాంతో ముసలి కలవరపడి.. సరే సరే అని కోతిని మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్ళింది. ముసలి నది ఒడ్డుకు చేరి చేరగానే కోతి ముసలి మీద నుంచి అమాంతం చెట్టు మీదకి దూకింది. ఆ తెలివితక్కువ ముసలి గుండె కాయ తో వస్తుందని ఎదురు చూస్తూ వుండి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: