నరసింహనాయుడు : ఇద్దరు స్టార్ హీరోలతో పోటీపడి ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాలయ్య..?

Pulgam Srinivas
సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. అలా అంత పెద్ద స్థాయిలో సందడి వాతావరణం నెలకొనడానికి ప్రత్యేక కారణం ఆ సమయంలో పెద్ద స్థాయిలో సెలవులు ఉండటంతో కుటుంబం అంతా కలిసి సినిమాలు చూడడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. దానితో కాస్త అటు ఇటు టాక్ వచ్చిన సినిమాలకు కూడా అద్భుతమైన కలెక్షన్లు వస్తాయి. అదే బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిన సినిమాలకైతే కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంటుంది.

దానితో సినిమా నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతి పండుగకు విడుదల చేయాలి అని భావిస్తూ ఉంటారు. అలాగే హీరోలు కూడా తమ సినిమాలు సంక్రాంతికి వస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే 2001 వ సంవత్సరం సంక్రాంతి పండక్కి బాలయ్య హీరోగా రూపొందిన నరసింహ నాయుడు , చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు , వెంకటేష్ హీరోగా రూపొందిన దేవిపుత్రుడు సినిమాలు విడుదల అయ్యాయి. ఈ మూడు సినిమాలు కూడా భారీ అంచనాలు నడుమ విడుదల అయ్యాయి. ఇక నరసింహ నాయుడు సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రాగా , మృగరాజు సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. దేవీపుత్రుడు సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.

ఇక టోటల్ బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నరసింహ నాయుడు సినిమా అప్పటివరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలవగా , మృగరాజు సినిమా ఫ్లాప్ అయ్యింది. దేవీపుత్రుడు సినిమా యావరేజ్ అయింది. ఇలా బాలయ్య , చిరు , వెంకటేష్ సినిమాలు 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా పోటీ పడగా నరసింహ నాయుడు మూవీతో ఇండస్ట్రీ హాట్ ను కొట్టి 2001వ సంవత్సరం బాలయ్య సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: