టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే మెగాస్టార్ చిరంజీవి కొంత కాలం పాటు సినిమాలను దూరం పెట్టి రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా ప్రజారాజ్యం అనే ఓ రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. అందులో భాగంగా అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో కూడా పాల్గొన్నాడు. కానీ ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. దానితో చిరంజీవి తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
అందులో భాగంగా చిరంజీవి , వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఖైదీ నెంబర్ 150 మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ 2017 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయింది. ఇకపోతే ఇదే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ హీరోగా రూపొందిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కూడా విడుదల అయింది. ఈ సినిమా 2017 వ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల అయింది. దానితో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ గట్టిగానే జరిగింది. ఈ రెండు సినిమాలకు మంచి టాక్ వచ్చింది. ఈ రెండు మూవీలు కూడా మంచి కలెక్షన్లను వసూలు చేశాయి. కానీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే లోపు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కంటే కూడా ఖైదీ నెంబర్ 150 మూవీ ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసింది.
దానితో 2017 వ సంవత్సరం సంక్రాంతి విన్నార్ గా ఖైదీ నెంబర్ 150 సినిమా నిలిచింది. ఇక రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి పని అయిపోయింది. ఆయన సినిమాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు అనే విమర్శకులు ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదలకు ముందు కొంత మంది వినిపించారు. కానీ చిరంజీవి మాత్రం ఖైదీ నెంబర్ 150 సినిమాతో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినా ఏమిటో నిరూపించుకున్నాడు.