సంక్రాంతి బ్లాక్ బస్టర్: బాలకృష్ణకి చుక్కలు చూపించిన Jr.ఎన్టీఆర్ "నాన్నకు ప్రేమతో".?

Pandrala Sravanthi
నాన్నకు ప్రేమతో.. తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. అలాగే నాన్నకు ప్రేమతో సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించగా.. బీవిఎస్ఎన్  ప్రసాద్ సినిమాని నిర్మించారు. అలా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన నాన్నకు ప్రేమతో మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.ముఖ్యంగా ఈ సినిమా బాలకృష్ణ మూవీ కి చుక్కలు చూపించిందని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఈ సినిమా వెనుక ఉన్న విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్,రకుల్ ప్రీత్ సింగ్ కాంబోలో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్ నటించారు. 

అలాగే ఈ మూవీలో విలన్ గా జగపతిబాబు నటీంచారు. కోటీశ్వరుడైన రాజేంద్రప్రసాద్ పేరు మార్చుకోవడానికి ఎవరు కారణమో తెలుసుకొని ఎన్టీఆర్ అతని పతనం కోసం చూస్తాడు.అలా జగపతిబాబు వల్లే రాజేంద్ర ప్రసాద్ పేరు మార్చుకునే పరిస్థితి వచ్చింది అని తెలుసుకున్న ఎన్టీఆర్ జగపతిబాబుని ఢీ కొట్టాలని చూస్తాడు. అలా విలన్ పై పగ సాధించడం కోసం ఆయన కూతుర్ని లవ్ లో పడేసి చివరికి జగపతిబాబుపై విజయం సాధిస్తాడు.. అలా తండ్రి సంతోషం కోసం ఎన్టీఆర్ తండ్రి పగను పంచుకొని జగపతిబాబు పై విజయం సాధిస్తాడు .ఇకఈ సినిమాలో ఎన్టీఆర్ సోదరులుగా రాజీవ్ కనకాల,శ్రీనివాస్ అవసరాల నటించారు.

అలా భారీ అంచనాల మధ్య వచ్చిన నాన్నకు ప్రేమతో మూవీ జనవరి 13, 2016లో విడుదల అయిది. ఇక ఈ సినిమాకి పోటీగా సంక్రాంతి బరిలో నాగార్జున  సోగ్గాడే చిన్నినాయన, బాలకృష్ణ డిక్టేటర్, శర్వానంద్ ఎక్స్ప్రెస్ రాజా లు వచ్చాయి... ఇక ఆ ఏడాది 2016 సంక్రాంతికి విడుదలై హిట్ అయిన సినిమాల్లో నాన్నకు ప్రేమతో,సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమాలు ఉన్నాయి. ఇక అదే ఏడాది సంక్రాంతి విడుదలైన బాలకృష్ణ డిక్టేటర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.అలా బాబాయ్ కి పోటీగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సంక్రాంతికి మంచి హిట్ కొట్టాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: