CMR కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. 300 ప్రైవేటు వీడియోలు బయటకు వచ్చినట్లు సమాచారం. మేడ్చల్, కండ్లకోయ CMR ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినుల హాస్టల్ వాష్ రూమ్ లలో ఫోన్ ద్వానా వీడియోల రికార్డింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలా దాదాపు 300 ప్రైవేటు వీడియోలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. 3 నెలలుగా వీడియో రికార్డింగ్ జరుగుతున్నప్పటికి దానిని బయటకు రాకుండా గోప్యంగా ఉంచిందట యాజమాన్యం.
విద్యార్థినిలు ప్రశ్నిస్తే... మీ వీడియోలు కూడా బయటపెడతామని విద్యార్థినులను భయభ్రాంతులకు గురి చేస్తోందట యజమాన్యం. ఇక రికార్డ్ అయిన వీడియోలు ఉంచుకొని విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేస్తోందట యాజమాన్యం. ఇప్పటికే అనేక మంది విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనీస విచారణ చేపట్టని ప్రభుత్వం...ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని, బాధ్యులైన యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ABVP ధర్నా చేసింది.
విద్యార్థినిలను బ్లాక్ మెయిల్ కు గురి చేస్తున్న సీఎంఆర్ కళాశాలని సీజ్ చేసి విద్యార్థినులను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి నేతలు. అయితే...మేడ్చల్ CMR ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వీడియో సంఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారట పోలీసులు. అనుమానితులను చెందిన 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాలేజ్ ప్రిన్సిపల్ ముందు పాలు డిమాండ్లు ఉంచిన స్టూడెంట్స్.. తక్షణమే వార్డెన్ ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
హాస్టల్ లో ఉన్న అన్ని సీసీ కెమెరాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని.. మెస్ తో సహా హాస్టల్ మొత్తంగా మహిళా సెక్యూరిటీ గార్డ్స్ నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రౌండ్ లో జూస్, పానీపూరి సెంట్లర్లను తొలగించాలని..సెక్యూరిటీ రూమ్స్ ను హాస్టల్ లోపల కాకుండా వెలుపల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. సాయంత్రం 6 గంటల తర్వాత టెక్నీషియన్స్ ను హాస్టల్ లోపలికి అనుమతించరాదని.. హాస్టల్ లో ఇంకా ఎక్కడైనా హిడెన్ కెమెరాలు ఉన్నాయా లేదా అని క్లియర్ గా తనిఖీలు చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.