మంచిమాట : మోసకారుల మాటలు.. నీటిలోని మూట లాంటివి..

Divya
సాధారణంగా మోస కారులు ఎదుటి వ్యక్తితో అంత త్వరగా బయటపడరు. ఎందుకంటే మనతో స్నేహం చేస్తున్నట్టే అనిపిస్తుంది , కాకపోతే మన వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు. మోసకారి మాటలు ఎప్పుడూ తీయగానే అనిపిస్తాయి. కాబట్టి వీరి నుంచి బయట పడాలి అంటే ముందు మనం జాగ్రత్త వహించాలి. అందుకు సమాధానంగా ఇప్పుడు ఒక చిన్న కథను ఉదాహరణగా తెలుసుకుందాం..
ఒక ఊరి చివరన సరస్సు ఒడ్డున ఒక తోడేలు, కొంగ నివసిస్తూ ఉండేవి. ఒకసారి అనుకోకుండా తోడేలు గొంతులో ఒక ఎముక అడ్డుపడింది. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ , తోడేలు గొంతులో నుంచి ఎముక బయటకు రావట్లేదు. అప్పుడు ఆ తోడేలు ఈ ఎముక నా గొంతులో నుంచి బయటకు రాకపోతే, నేను ఆహారం తినలేక , ఆకలితో మల మల మాడి చావాల్సి వస్తుంది ..అని తన చేతిని గొంతులో లోపలికి పెట్టి తీయడానికి ప్రయత్నం చేసింది .కానీ ఎంత ప్రయత్నించినా మరల తన ప్రయత్నంలో ఓడిపోయింది తోడేలు.
ఇంతలో కొంగ అక్కడికి వచ్చింది.. దాని ముక్కుతో ఎంతటి లోతైన సులభంగా తీసివేయగలదు. ఎలాగైనా సరే ..నా గొంతులో ఉన్న  ముక్క తీసివేయామని కొంగను బ్రతిమిలాడు కోవాలి అని అనుకుంటుంది తోడేలు. ఇక అనుకున్నదే తడవుగా, కొంగ దగ్గరకు వెళ్లి తోడేలు కొంగ బావ..!  నా గొంతులో ఎముక అడ్డుపడింది.. ఎలాగైనా సరే నువ్వు బయటకు తీయాలి ..తీస్తే నీకు ఒక ఖచ్చితమైన బహుమతి ఇస్తాను.. అంటూ బ్రతిమాలాడుకుంది. దయ కలిగిన కొంగ పోనీలే పాపం..! తోడేలు ఇంతగా బ్రతిమిలాడు కుంటోంది  కదా..! ఎలాగైనా సరే దాని గొంతులో ఇరుక్కున్న ఎముక ముక్క తీసి వేద్దామని అనుకుంటుంది. కొంగ అనుకున్నట్లుగానే తోడేలు గొంతులో ఉన్న ఎముక ముక్క ను నెమ్మదిగా తీసి వేసింది.

అప్పుడు తోడేలు ధన్యవాదాలు కొంగ బావ..! చాలా ఆకలిగా ఉంది.. వెళ్లి ఏదైనా తినేసి వస్తాను.. అంటూ చెప్పింది. అప్పుడు మరి నాకు ఇస్తానన్న బహుమతి ఏది అని అడిగితే.. నేను నీకు ఏ బహుమతి ఇస్తానని చెప్పలేదు కదా ..! అంటూ అక్కడి నుంచి తుర్రుమంది తోడేలు. అందుకే మోస కారులను నమ్మేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: