మంచిమాట : అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పిన మంచి మాట..

Divya
వింటే మహాభారతమే వినాలి..తింటే గారెలు మాత్రమే తినాలి అన్న సామెత ఎందుకు వచ్చింది అంటే, మహాభారతాన్ని పూర్తిగా చదివినా లేదా విన్న తర్వాతనే అర్థం చేసుకున్న వారికి ,ఈ సామెతను ఎందుకు ఉపయోగించారు అనే విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది. భారతం విన్న ప్రతిసారి లేదా చదివిన ప్రతిసారి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక కొత్త విషయం తెలియడం, ఇందులో ఉన్న ప్రత్యేకత. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, కురుక్షేత్ర యుద్ధం తర్వాత అంబ చేతిలో హతమార్చబడిన భీష్ముడు.. అంపశయ్యపై వున్న భీష్ముడితో ధర్మరాజు తన మదిలో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నాడు.ఇక ఈ లోకానికి కూడా భీష్ముడు కొన్ని మంచి మాటలను చెప్పాడు అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం చేసే కర్మలు రేపటి మన భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ప్రతి ఒక్కరూ తెలిసీతెలియక చేసే కర్మలన్నీ వారి నుదిటిన ఏమి రాసి ఉంటుందో దానికి పట్టుబడక తప్పదు. మనం చేసే పాప కార్యమైనా.. పుణ్యకార్యాలయినా భవిష్యత్తులో దాని ఫలితం తప్పక అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి సత్కార్యాలు చేయడం మొదలుపెడితే, భవిష్యత్తులో కూడా మంచి జరుగుతుంది అని చెప్పాడు భీష్ముడు.

కానీ కురుక్షేత్ర యుద్ధానికి కారకుడైన దుర్యోధనుడు దుష్కర్మలు చేసాడు కాబట్టి ,అతనితో పాటు అతని వంశం మొత్తం నశించిపోయింది.ఎంతోమంది బంధుమిత్రులు కూడా నశించి పోయారు. వారంతా కూడా వారు , వారు చేసిన దుష్కర్మలకు ఫలితంగా మరణించడం జరిగింది. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరుల వల్ల అది జరిగింది అని అనుకోవడం తప్పు. మనం చేసిన పాపపుణ్యాలు మనకు ఎలాంటి ఫలితం ఇస్తాయో, దానిని బట్టే అర్థమవుతుంది. ఏదైనా సమస్యలో మనం ఉన్నప్పుడు లేదా ఎవరి వల్ల అయినా మనం బాధ పడినప్పుడు, ఎదుటివారిని నిందించకూడదు. మన కర్మానుసారం జరుగుతుంది అని సరిపెట్టుకోవాలి అని భీష్ముడు సెలవిచ్చాడు.
అంతేకాదు ఒకవేళ జీవం మన శరీరాన్ని వదిలినా,  తిరిగి మరో శరీరానికి చేరినా చేసిన దుష్కర్మ లకు ఫలితం అనుభవించక తప్పదు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తతతో ఉంటూ, సత్కార్యాలు చేస్తూ, జీవితంలో ముందడుగు వేయడం వల్ల భవిష్యత్తు  మనకు పూల బాటలు వేస్తుంది అని భీష్ముడు చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: