మంచిమాట : మనిషిలో పరివర్తన రూపాంతరం చెందింతే.

Divya
మనుషులలో మార్పు సహజంగా రావాలి. అలా ఎప్పుడైతే మార్పు వస్తుందో..? అప్పుడే జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటాడు. అయితే ఇందుకు తగిన ఒక చిన్న కథను తెలుసుకుందాం..
ఉజ్జయిని అనే ఒక రాజ్యంలో ఒక గురుకుల పాఠశాల ఉండేది . అందులో శ్రీ దత్తుడు అనే ఒక శిష్యుడు కూడా ఉండేవాడు. పద్యాలను కంఠస్థం చెయ్యడంలో ఒక మంచి నేర్పరి గా గుర్తింపు పొందాడు. ఇక మిగతా శాస్త్రాల విషయానికి వస్తే క్షణాలలో నేర్చుకునేవాడు. ఇక ఈ బాలుడిని అందరూ బాలమేధావి అని పిలుస్తూ ఉండేవారు. ఇంత తెలివి ఉన్న బాలుడికి చదవడం, నేర్చుకోవడం అంటే ఎనలేని ఇష్టం . కానీ రాయడం అంటే మాత్రం అస్సలు నచ్చేది కాదు. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా రాయడానికి మాత్రం చాలా బద్దకించేవాడు.
శ్రీ దత్తుడిని అతని గురువు . దగ్గరకు పిలిచి,  శ్రీ దత్త నీకు అన్ని విషయాల్లో మంచి నేర్పు ఉంది.ఏదైనా నేర్చుకోగలరు.. చదవగలరు.. ఇతరులకు విశ్లేషించగలరు.. కానీ రాయడానికి ఎందుకు ఇంత బద్దకిస్తున్నావు అని అడిగాడు. ఇలా రాయడం అనే అలవాటును కూడా నేర్చుకోగాలిగినట్లయితే, జీవితంలో ఎన్నో పద్యాలను కథలను వ్రాయడమే కాకుండా, చరిత్రలో ఒక మంచి కవిగా గుర్తింపు పొందుతావు అని చెప్పాడు. కానీ శ్రీ దత్తుడికి ఇవేవీ చెవికెక్కలేదు.

అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత గురుకులానికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువుతో శ్రీ దత్తుడి గురించి అంతా వివరించాడు గురువు. ఎలాగైనా సరే శ్రీ దత్తుడి లో మార్పు తీసుకురావాలని కూడా కోరాడు. సరే నని చెప్పాడు సాధువు. ఇక అందుకు తగ్గట్టుగానే సాధువు,  శ్రీ దత్తుడిని పిలిచి రెండు పద్యాలు చెప్పమన్నాడు. ఇక శ్రీ దత్తుడు క్షణాల్లో పద్యాలను అప్పజెప్పాడు. అందుకు సాధువు .." ఈ పద్యాలు అన్నింటినీ కవులు గ్రంథాల రూపంలో రాయడం వల్లే కదా..! ఈరోజు నీవు చక్కగా నేర్చుకున్నావు. కాబట్టి నీవు కూడా రాయడం మొదలు పెట్టు "..అని చెప్పాడు. శ్రీ దత్తుడు వినలేదు.
 ఒక మూడు రోజులు గడిచిపోయాయి. శ్రీ దత్తడి లో ఎలాంటి మార్పు లేదు. ఇక సాధువు అక్కడున్న పిల్లలందరినీ పిలిచి,  శ్రీ దత్తుడిని ఈరోజు నుంచి బద్దకస్తుడు అని అనడం ప్రారంభించండి అని చెప్పండి.
ఇక అందరూ శ్రీ దత్తుని బద్దకస్తుడు.. బద్దకస్తుడు.. అని పిలవడం మొదలుపెట్టారు. మొదటి , రెండు రోజులు తెలియనట్టు ఊరుకున్నా, మూడవరోజు వారి మాటలను భరించలేక శ్రీ దత్తుడు రాయడం మొదలుపెట్టాడు. అలా ఎన్నో కవితలు , పద్యాలు వ్రాసి మంచి కవిగా గుర్తింపు పొందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: