మంచిమాట : ముఖ్యంగా స్త్రీలు చేయకూడని పనులు ఏంటో తెలుసా ?

Divya

స్త్రీలు ముఖ్యంగా కొన్ని కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఆ పనులు ఏమిటో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం. స్త్రీలు ఎప్పుడూ మంచి పనులను శుక్ల పక్షము నందు చేయడానికి పూనుకోవాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకు వచ్చే రోజులను శుక్ల పక్షం అని అంటారు ఈ రోజుల్లో మాత్రమే మంచి పనులు చేపట్టాలి.
అంతే కాకుండా స్త్రీ లు తమ భర్త, పిల్లల విషయంలో మంగళవారం నాడు క్షవరము , గడ్డము తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇలా చేయడం వల్ల అవి దరిద్రానికి సంకేతాలు.
స్త్రీలు పడుకునే ముందు గాజులు, కమ్మలు ,తాళిబొట్టు లాంటివి తీసి నిద్రించరాదు.
ఈ మధ్య కాలంలో ఎవరైనా మనం బాధలో ఉన్నప్పుడు విచారించడానికి వచ్చిన వారిని, రండి కూర్చోండి అని చెప్పి ఇంట్లో కాఫీ ఇచ్చి వారికి అతిథి మర్యాదలు చేస్తున్నారు. కానీ ఇలా చేయడం వల్ల  దరిద్రానికి నాంది పలుకుతుంది అని తెలుసుకోవాలి.
కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివర్లో కొద్దిగా పసుపు రాయడం మంచిది .ఎందుకంటే ఇది క్రిమినాశక సంకేతం కాబట్టి.
ఒకరు తలలో పెట్టుకున్న పూలను మరొకరు ధరించడం మంచిది కాదు.
ఉప్పు మిరపకాయలు చింతపండు వంటి వాటిని ఎవరికీ చేతితో ఇవ్వకూడదు ఒకవేళ ఇవ్వాలనుకుంటే కింద పెడితే వాళ్లే తీసుకుంటారు.
నలుపు రంగు బట్టలు కూడా ధరించకూడదు .
ప్రతిరోజు భోజనానికి ముందు కాకి అన్నం పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల పితృదేవతలు సంతృప్తి పడతారు.
స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకుని ఉండకూడదు. విరబోసుకొని ఇంట్లో తిరగడం వల్ల జేష్టాదేవి కి కోపం వస్తుందట.
వ్రతాలు చేసే సమయంలో టెంకాయ చిప్పతో తాంబూలం ఇచ్చేటప్పుడు మూడు కన్నులు ఉండే భాగాన్ని మీరు ఉంచుకొని, మిగతా భాగాన్ని మాత్రమే ఇతరులకు ఇవ్వాలి.
సుమంగళి స్త్రీలు రాత్రివేళ యందు అలిగి, భోజనం చేయకుండా నిద్రించకూడదు.
ప్రతీసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడిచేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: