మంచిమాట : నిజమైన పేదవాడికి, ధనవంతుడికి మధ్య తేడా ఇదే..

Divya

సాధారణంగా ధనవంతులు ఎప్పుడూ పేద వాళ్ళని హేళనగా చూస్తూ ఉంటారు అనే విషయంలో ఎంత నిజముందో తెలియదు కానీ, ఇప్పుడు చెప్పబోయే ఒక అంశాన్ని చదివితే మాత్రం ఖచ్చితంగా నిజమైన పేదవారికి, ధనవంతులకి మధ్య తేడా ఇట్టే తెలిసిపోతుంది.. ముఖ్యంగా ఎంత పెద్ద ధనవంతుడికి అయినా సరే తెగితే రక్తమే వస్తుంది.. ఇక చనిపోతే మట్టిలోకి కలవాలి. కానీ ఇది తెలియక చాలామంది ధనవంతులు,పేద వాళ్ళను మరీ అధ్వానంగా చూస్తున్నారు.. అయితే ఒక ధనికుడైన తండ్రి తన కుమారుడికి అసలైన పేద వారు ఎలా ఉంటారో? వారు ఎలా జీవిస్తారో?  చూపించడం కోసం ఒక గ్రామానికి తీసుకెళ్లాడు..

ఆ గ్రామంలో నివసిస్తున్న ఒక పేద కుటుంబం తో కొంత సమయం గడిపారు ఆ తండ్రి కొడుకులు. ఇక తిరుగు ప్రయాణం పట్టగా, ఆ తిరుగుప్రయాణంలో తండ్రి తన కొడుకుని ఇలా అడిగాడు.. బాబు.. చూసావు కదా..!  పేద వారు ఎలా ఉంటారో?ఎలా జీవిస్తారో? వారికి, మనకి మధ్య తేడా ఏంటో? దీనిబట్టి నువ్వు ఏం నేర్చుకున్నావ్? అని ఆ తండ్రి తన కొడుకుని అడిగాడు..
ఇక అందుకు కొడుకు, తన సమాధానంగా ఇలా అన్నాడు.. మనకు ఒక కుక్క మాత్రమే ఉంది. వారికి నాలుగు కుక్కలు ఉన్నాయి. మనకు ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది. వారికి ఏకంగా ఒక పెద్ద నదే ఉంది. మనకు చీకటి పడితే వెలుగు నివ్వడానికి  ట్యూబ్ లైట్ లు ఉన్నాయి. ఇక వారికి చీకటి పడితే వెలుతురు ఇవ్వడానికి నక్షత్రాలే ఉన్నాయి. మనం ఆహారాన్ని కొనుక్కొని తింటున్నాను. కానీ వాళ్ళకి కావలసిన ఆహారాన్ని వాళ్లే పండించుకుంటున్నారు.

మనకు రక్షణగా గోడలు ఉన్నాయి. కానీ వారికి రక్షణగా స్నేహితులు ఉన్నారు. మనకు కాలక్షేపం కోసం టీవీ, సెల్ ఫోన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు కుటుంబంతో, బంధువులతో ఆనందంగా గడుపుతున్నారు.. ఇప్పుడు అర్థం అయింది డాడీ.. మనం ఎంత పేదవాళ్లమో .. ఇదంతా నాకు చూపించినందుకు చాలా థాంక్స్ డాడీ.అని ఆ బాబు తన తండ్రితో చెప్పాడు.. ఇక నిజమైన పేదవాడికి, ధనికుడు కి మధ్య తేడాలు ఈ ఒక్క మాటలో చూపగలిగారు ఆ తండ్రీ కొడుకులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: