మంచి మాట : గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు..ధనాన్ని చూసి కాదు..

Divya

ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఇండియా హెరాల్డ్ మీ కోసం ఒక మంచి మాటను మీ ముందుకు తీసుకు వచ్చింది.. అది ఏమిటంటే.. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు..ధనాన్ని చూసి కాదు.. దీని అర్థం ఏమిటంటే నీవు కోటాను కోట్లకు అధిపతి అయినా సరే మన చుట్టూ ఉండే నలుగురు నీ గుణం ఎలాంటిది, నీ ప్రవర్తన ఎలాంటిది అని గమనించిన తర్వాత సమాజంలో నీకంటూ ఒక గౌరవాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తారు. నీ డబ్బులు చూసి ఎవరు గౌరవం ఇవ్వరు.. అని దీని వివరణ..

ఉదాహరణకు ఎన్నో వేలకు వేలు ఖర్చుపెట్టి కొన్న చెప్పులను ఒక మూల పడేయడమో లేదా గుడి బయట మాత్రమే వదిలేసి వెళ్తాము.. కానీ కేవలం తక్కువ ఖర్చుతో కొన్న కొబ్బరి కాయను మాత్రం గుడిలోకి దేవుడి ముందు సమర్పిస్తాం..  అంటే డబ్బులు చూసి ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పులను గుళ్ళోకి తీసుకెళ్లలేము కదా.. టెంకాయ యొక్క పవిత్రత ఎంత గొప్పగా ఉంటుంది అంటే గుడిలో దేవుడంత పవిత్రంగా ఉంటుంది..

 కానీ డబ్బు అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు..ఎప్పుడు పోతుందో తెలియదు.. ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంది కదా అని నలుగురిని పట్టించుకోకుండా ఉంటే మాత్రం సమాజంలో ఎవరు నీకు గౌరవం అంటూ ఇవ్వరు. నలుగురిలో నీ ప్రవర్తన, మంచితనం ఇతరులకు సహాయం చేసే గుణం బట్టి ప్రజలు నీకు నీరాజనాలు పడతారు..

కాబట్టి డబ్బు ఉంది కదా అని ఉర్రూతలూగకుండా నలుగురితో మంచిగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయాలి.. అప్పుడే సమాజంలో గౌరవం ఉంటుంది. డబ్బులు చూసి అయితే ఎవరూ ముందుకు రారు.. ఇతరులు మనం ఎలాంటి వారము గమనించినప్పుడు మాత్రమే మన వద్దకు వస్తారు . మనం చనిపోయిన తర్వాత మన వెంట ఏది రాదు. కేవలం నలుగురిలో సంపాదించుకున్న మాట, మర్యాద మాత్రమే చనిపోయిన తరువాత కూడా మన గురించి అనుకునేలా చేస్తాయి..
కాబట్టి డబ్బుంది కదా అని ఏది పడితే అది చేయకుండా,నలుగురిలో సహాయం కోరిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ గౌరవమర్యాదలు పొందడానికి ప్రయత్నించండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: