మంచిమాట: మనకున్న దానితో సంతృప్తి పడటం ఉత్తమమే కానీ.. మనకున్న జ్ఞానం చాలనుకోవడమే అజ్ఞానం
నేటి మంచిమాట.. మనకున్న దానితో సంతృప్తి పడటం ఉత్తమమే కానీ.. మనకున్న జ్ఞానం చాలనుకోవడమే అజ్ఞానం. అంతేకదా! మనకు ఉన్నదీ చాలులే అని జీవిస్తే నీకు భవిష్యత్తు ఏముంటుంది. ఎందులో అయినా మనకు ఇంత చాలులే, ఇది చాలులే అని మనం సంతృప్తి పొందవచ్చు. కానీ తెలుకునే జ్ఞానంలో మాత్రం చాలు అనుకోకూడదు. చాలు అనుకుంటే అది అజ్ఞానమే అవుతుంది.
అసలు ఎందుకు అవుతుంది అని మీకు అనిపించచ్చు. ఎందుకో చెప్తాను వినండి. మీకు మంచి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో కోట్లు సంపాదించారు. కానీ ఎవరో ఒక ఎదవా వచ్చి మీ ఆస్తిని అంత కాజేశాడు. అప్పుడు మీరు ఏం అంటారు పోతే పోనీలే.. మళ్లీ కొద్దీ రోజుల్లోనే ఇది అంత సంపాదించుకుంట అని అంటడు. దీనికి కారణం జ్ఞానం.
అతని జ్ఞానంతో ఇంత అయినా సంపాదించచ్చు.. ఇంతకంటే ఎక్కువ అయినా సంపాదించచ్చు. ఏది అయినా దొంగతనం చెయ్యచ్చు కానీ బుర్రలో ఉండే జ్ఞానాన్ని ఎవరు దొంగలించలేరు కదా! అదే ఆ ఆస్తి, డబ్బు దొంగలించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ డబ్బుతో ఎన్ని రోజులు ఆనందంగా ఉంటారు? అది అంత అయిపోయేవారుకూ ఉంటారు.
అంత అయ్యాక మళ్లీ కూడా దొంగతనమే చెయ్యాలి కదా! అదే జ్ఞానం ఉంటే ఎంత అయినా సంపాదించచ్చు.. ఏమైనా చెయ్యచ్చు. అందుకే మనకున్న జ్ఞానంతో పాటు ఇంకా ఇంకా పెంచుకోవాలి.. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. ముందు రోజుకంటే ఈరోజు నువ్వు ఎక్కువ తెలుసుకొని ఉండాలి. ఈరోజు కంటే రేపు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా జ్ఞానాన్ని చాలు అని అనుకోకూడదు.