మంచిమాట: మన ఆలోచనల తీరును బట్టే మనకు ఆనందం లభిస్తుంది

Durga Writes

నేటి మంచిమాట.. మన ఆలోచనల తీరును బట్టే మనకు ఆనందం లభిస్తుంది. అవునా ? కదా? నేను అయితే అవును అనే చెప్తా. ఎందుకంటే అది నిజం కాబట్టి. మన ఆలోచన తీరు బట్టే మనకు ఆనందంగా లభిస్తుంది. నువ్వు ఏ విషయాన్ని అయినా మంచిగా తీసుకుంటే... ఏ విషయంలో అయినా ఆనందాన్ని చూస్తే నీకు ఆనందమే లభిస్తుంది. 

 

అలా కాదు అని.. ఆనందం కాకుండా.. మారే విషయాన్నీ అయినా చూస్తే నీకు ఆనందం కాదు కదా మారేది ఉండదు. మన ఆలోచనలు బాగుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే ఏ విషయంలో అయినా నెమ్మదిగా అలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.. మంచి నిర్ణయాలు తీసుకుంటే ఆనందం లభిస్తుంది. 

 

కాబట్టి.. ఏదైనా సరే.. అలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలా కాదు అని.. ప్రతిదీ నెగటివ్ గా చూసి నెగటివ్ ఆలోచనలు చేస్తే మంచిలో కూడా చేదు కనిపించి కోపం పీకలదక వచ్చి జీవితంలో ఆనందం అనేదే కరువు అవుతుంది. నేను ఆనందంగా ఉండలేకపోతున్నా అని నిందించుకునే ముందు నీ ఆలోచన తీరును మార్చుకో. నీ జీవితంలో ఆనందం లభిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: