పాపం జూనియర్ ఎన్టీఆర్.. తలచుకునేవారే కరవయ్యారు..

Chakravarthi Kalyan
రాజకీయ వారసుడిగా లోకేశ్ ను ఒక్కో మెట్టూ ఎక్కించడంలో చంద్రబాబు పూర్తిగా సక్సస్ అయ్యారు. 2,3 ఏళ్ల క్రితం టీడీపీ శ్రేణుల్లో ఎవరు భవిష్యత్ నేత అనేదానిపై అనుమానాలుండేవి.. లోకేశా, జూనియర్ ఎన్టీఆరా, బాలకృష్ణా.. ఎవరో అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి చంద్రబాబు క్రమంగా లోకేశే భవిష్యత్ నేత అనేలా ప్లాన్ చేశారు. 

మహానాడులో లోకేశ్ మంత్రం.. 

 
ఎన్టీఆర్ అభిమానుల నుంచి, కుటుంబం నుంచి వ్యతిరేకత రాకుండా క్రమంగా పావులు కదిపారు. గతంలో మహానాడులో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పెట్టలేదన్న విషయం గొడవకు దారి తీసింది. ఇప్పుడు పాపం.. మహానాడుకు హాజరుకాకపోయినా జూనియర్ ఎన్టీఆర్ ను పట్టించుకున్నవారే కరవయ్యారు. జూనియర్ తండ్రి హరికృష్ణ కూడా ఓ సాధారణ నేతలా మహానాడుకు హాజరయ్యారు. 

జూనియర్.. ఆ మాటే వినిపించడం లేదు..


ఇప్పుడు పార్టీ వ్యవహారం అంతా లోకేశ్ చేతుల మీదుగానే నడుస్తోంది. ఈ మహానాడుతో పార్టీలో లోకేశ్ స్థానం ఏంటో కార్యకర్తలందిరకీ తెలిసొచ్చింది. ఒక జటిలమైన, సున్నితమైన సమస్యను చంద్రబాబు తన చాణక్యంతో సింపుల్ గా నెగ్గుకొచ్చాడు. మరి లోకేశ్ తన టాలెంట్ చూపించగలడా.. అన్నది కాలం నిర్ణయిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: