ఆంధ్రా మెట్రో దూసుకువచ్చేస్తోంది..!?

Chakravarthi Kalyan

కొత్త రాజధాని కోసం ఏపీ ముఖ్యమంత్రి భారీ ప్రణాళికలే రచిస్తున్నారు. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆధునిక నగరాల చిరునామాగా మారిన మెట్రో రైల్, ఎయిర్ పోర్టుల వంటి మౌలిక సదుపాయాల కల్పన దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. 




అమరావతి ప్రాంతానికి పెరగే వాహన రద్దీని అంచనా వేసిన ఏపీ ప్రభుత్వం తొలి దశలోనే మెట్రో రైలును తుళ్లూరు వైపు పరుగులు పెట్టించాలనుకుంటోంది. ఆమేరకు ఇప్పటికే డీపీఆర్ నివేదిక రెడీ చేసి పెట్టేసింది. మరి ఈ కొత్త మెట్రోకు నిధులు ఎలా.. అందుకే కేంద్రం, రాష్ట్రం చెరో 20 శాతం ఖర్చు భరిస్తే... మిగిలిన నిధులను సొంతంగానే సమకూర్చుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. 


వచ్చే ఎన్నికల నాటికి అమరావతిలో మెట్రో పరుగులు పెట్టించేసి.. ఎన్నికల్లో ఓట్లు కొట్టేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఐతే..అది సాధ్యమేనా.. నాలుగేళ్ల క్రితమే హైదరాబాద్ మెట్రో పనులు ప్రారంభమైనా.. ఇంకా ఓ కొలిక్కిరానేలేదు.. పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలంటే ఓ ఏడాది పట్టే అవకాశం ఉంది. అలాంటిది బెజవాడ మెట్రో నాలుగేళ్లలో పూర్తవుతుందా.. చంద్రబాబు ఎన్నికల కలలు నిజం చేస్తుందా.. చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: