ఈయన పెళ్లి ‘బంగారం’ కానూ..!!

Edari Rama Krishna

పూర్వం మహారాజుల వివాహ మహోత్సవం అంటే నెల రోజుల ముందు నుంచి రాజ్యం నలుమూల ఎంతో వైభోగం ఉండేది.  రాజ్యంలో ప్రజలు   సంబరాల్లో మునిగి తేలేవారు. ఇక యువరాజు వివాహం అంటే వజ్ర,వైఢుర్యాలు,మణిరత్నాలు,బంగారు ఆభరణాలతో అంత్యంత వైభవంగా పెళ్లిళ్లు జరిపేవారు. ఈ కాలంలో కూడా ఆ కాలాన్ని మరిపించేలా వివాహం అయ్యింది.   ఊహకే అసుయా కలిగేలా జరిగింది ఆ రాజు పెళ్లి. కోట్ల రూపాయల ఖర్చుతో  అతిరథమహారథుల దీవెనలు  కోట్ల రూపాయల ఖర్చు ఒక ఎత్తయితే… వజ్రవైఢూర్యాలు, సర్ణమయంతో నిండిన వేధికతో బ్రూనె యువరాజు అబ్దుల్ మాలిక్ వివాహ అంగ రంగ వైభవంగా జరిగింది.  


అబ్దుల్ మాలిక్కు,దయాంగకు రాబి 


ఈ తంతు వారం నుంచి బ్రూనె రాజధాని బందర్ సెరీ బెగవాన్లోని ప్యాలెస్లో ఈ పెళ్లి సంబరాలు అంగరంగవైభగంగా కొనసాగింది. శనివారం రాత్రి వధూవరులిద్దరూ వేలమంది అతిథుల సమక్షంలో మనువాడారు. వజ్రవైఢూర్యాలు పొదిగిన ఉంగరాలు మార్చుకున్నారు. వజ్రాలతో తయారుచేసిన పూల బొకేలను ఇచ్చిపుచ్చుకున్నారు.


అత్యంత వైభవంగా రూపుదిద్దుకున్న పెళ్లి వేధిక


రాజు హస్సనల్ బోల్కాయీ కుమారుడైన 31ఏండ్ల అబ్దుల్ మాలిక్కు డాటా అనలిస్టుగా పనిచేస్తున్న 22ఏండ్ల దయాంగకు రాబితో వివాహమైంది. అయితే పెళ్లికూతురు కాళ్లకు ధరించిన చెప్పులు, కాళ్ల పట్టీలు కూడా మొత్తం స్వర్ణం, వజ్రాలు కలబోసినవే కావడం ఆశ్చర్యనికి గురికాక తప్పదు. వధూవరులు కూర్చున్న వేదిక చుట్టూ బంగారమే. ఆసనాలు, మండపం అంతా స్వర్ణమయమే. ఆహా ఈ కాలంలో కూడా ఇంత వైభోగమైన పెళ్లి జరగడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: