3 నెలల్లో జగన్ కు నట్లు బిగించేస్తారట..

Chakravarthi Kalyan
                                  వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను అక్రమాస్తుల కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి బెయిల్ పై బయట బాగానే తిరుగుతున్నా.. ఏక్షణమైనా ఆయన్ను మరోసారి కటకటాల వెనక్కి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో సీబీఐ పేరు చెబితే ఉలిక్కే పడే యువనేతను ఇప్పుడు మరో కేంద్ర దర్యాప్తు సంస్థ హడలెత్తిస్తోంది. అదే ఈడీ.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అనే ఈ సంస్థ ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసుపై సీరియస్ గా దృష్టిపెట్టిందట.                                 వాస్తవానికి ఈ ఈడీ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంటుంది. దానికి దేశవ్యాప్తంగా బ్రాంచీలుంటాయి. కానీ ప్రతిసారి ఢిల్లీ నుంచి రావడం.. పరిశోధన ఇబ్బందిగా ఉందని.. జగన్ పై ఉన్న కేసులను హైదరాబాద్ ఈడీ శాఖకు బదలాయించేశారట. ఇన్నాళ్లూ డిల్లీలో ఉండటం వల్ల దర్యాప్తు ఆలస్యమైంది కానీ ఇప్పుడు మాత్రం ఇన్వెస్టిగేషన్ ఊపందుకుంటుందని జగన్ వ్యతిరేక వర్గాలు పండుగ చేసుకుంటున్నాయి.                                 ఈ ఈడీ తన దర్యాప్తు కోసం గతంలో సీబీఐ పెట్టిన చార్జిషీట్లను పరిగణనలోకి తీసుకుంటోంది. సీబీఐ ఇప్పటికే 11 కేసుల్లో చార్జీషీట్లు దాఖలు చేసింది. ఇప్పడు ఆ చార్జిషీట్లే ఈడీ పాలిట అస్త్రాలుగా మారుతున్నాయట. దర్యాప్తు మరింత వేగవంతం చేసేందుకు ఈడీ ప్రత్యేక బృందాలను కూడా నియమించుకుందట. ఈడీ జోరు చూస్తుంటే.. మూడు నెలల్లో ఈ కేసుల దర్యాప్తు పూర్తయ్యే అవకాశం ఉందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీ పీకల్లోకి కష్టాల్లో ఉంది.. మళ్లీ జగన్ జైలుకెళ్లాల్సి వస్తే..ఇక వైకాపాను ఆ దేవుడే కాపాడాలేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: