తెరాస కు వైకాపా మద్దతు.. కాంగ్రెస్ కు జనసేన ..?

Balachander
తెలంగాణలో హుజూర్ నగర్ ఉపఎన్నిక ఈనెల 21 వ తేదీన జరగబోతున్నది.  ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తెరాస పార్టీ చూస్తున్నది.  రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్నది.  ఈ సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఎన్నికపై పడే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని, ఆర్టీసీ తో పాటు ఉద్యోగాల కల్పన విషయంలో కూడా తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.  


కాగా, రాష్ట్రంలో సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఈ రోజు ఈ సమ్మెపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.  ఈ నిర్ణయంపైనే తెరాస ప్రభుత్వం ఆధారపడి ఉంటుందా అంటే ఏమో చెప్పలేం.  అయితే, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెరాస పార్టీకి మద్దతు ఇవ్వాలని వైకాపాను తెరాస పార్టీ కోరింది.  దీనికి ఆ పార్టీ కూడా సానుకూలంగా స్పందించింది.  తెరాస కు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.  తెరాస పార్టీకి వైకాపా మద్దతు ఇస్తుండటంతో కొంతమేర తెరాసకు కలిసి వస్తుంది.  


ఇక ఇదిలా ఉంటె, కాంగ్రెస్ పార్టీ ఇటీవలే జనసేన పార్టీ ఆఫీస్ కు వెళ్లి అక్కడి నేతలను కలిశారు.  హుజూర్ నగర్ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.  అయితే, పవన్ {{RelevantDataTitle}}