జగన్ లోకల్ బాబు, పవన్, బాలయ్య, లోకేశ్ నాన్ లోకల్.. వైసీపీ బ్రహ్మాస్త్రం ఇదే!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. అటు వైపీపీ, ఇటు కూటమి నేతలు ఒకింత దూకుడుతో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసున్నారు. మరోవైపు జగన్ నేను లోకల్ అని బాబు, పవన్, బాలయ్య, లోకేశ్ నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తూ ఓటర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేశ్, బాలయ్య హైదరాబాద్ లోనే నివాసం ఉంటారనే సంగతి తెలిసిందే.
 
ఈ నేతలు ఎన్నికలు పూర్తయ్యే వరకు మాత్రమే పోటీ చేసే నియోజకవర్గాలలో దర్శనమిస్తారని ఎన్నికలు పూర్తైన వెంటనే హైదరాబాద్ కు వెళ్లిపోతారని జగన్ ఎద్దేవా చేశారు. జగన్ చేసిన కామెంట్లు సైతం నిజమేనని చాలామంది భావిస్తారనే సంగతి తెలిసిందే. వాస్తవానికి వైసీపీ అభిమానులు సైతం ఇదే విషయంతో ఏకీభవిస్తారు. జగన్ పుట్టింది పెరిగింది పులివెందులలో అని ఆయన పులివెందుల వేదికగానే రాజకీయాలు చేస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయినా ఏపీలోనే ఉంటారని ఈ సందర్భంగా వాళ్లు గుర్తు చేస్తున్నారు.
 
నందమూరి బాలకృష్ణ ఎన్నికలు పూర్తైన వెంటనే హైదరాబాద్ కు వెళ్లి తన సినిమాలు, ఇతర కార్యక్రమాలతో బిజీ అవుతారు. హిందూపురం ప్రజలు సైతం బాలయ్య నాన్ లోకల్ కావడం వల్ల తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. బాలయ్య ఇంఛార్జీలను నియమించినా వాళ్లు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరనే ఆరోపణలు ఉన్నాయి.
 
చంద్రబాబు, లోకేశ్ సొంత నియోజకవర్గం చంద్రగిరి కాగా 1983 సంవత్సరంలో చంద్రగిరి నుంచి పోటీ చేసిన చంద్రబాబు ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రోజుల్లో చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేశారు. ఈ లెక్క ప్రకారం చంద్రబాబు నాన్ లోకల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లోకేశ్ కు హైదరాబాద్ లోనే వ్యాపారాలు ఉన్నాయి. మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నారా లోకేశ్ నాన్ లోకల్ అనే భావించాలి.
 
పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ఈ నియోజకవర్గం పవన్ సొంత నియోజకవర్గం కాదు. పవన్ ఎమ్మెల్యేగా గెలిచినా పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉండరని ప్రచారం జరుగుతోంది. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత సైతం నేను లోకల్ పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అంటూ ప్రజల మద్దతు పొందే ప్రయత్నం అయితే చేస్తుండటం గమనార్హం.
 
కూటమి ప్రధాన నేతలంతా నాన్ లోకల్ అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేయడం  వైసీపీకి ఒకింత కలిసొస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలయ్య, లోకేశ్ లను ఓడించాలని గట్టిగా ప్రయత్నిస్తుండటం గమనార్హం. వైసీపీకి బ్రహ్మాస్త్రం ఇదేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాన్ లోకల్ ప్రచారం కూటమి అభ్యర్థుల విజయంపై ప్రభావం చూపుతుందేమో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: