కుల వ్యవస్థ గురించి సద్గురు ఏమన్నారు..?

Gowtham Rohith
సద్గురు నుంచి మన భారతీయ కుల వ్యవస్థ గురించి తాను నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా అని క్రికెటర్ సెహవాగ్ కోరారు. ప్రజల మధ్య మరింత కలుపుగోలుతనం సమానత్వం ఎలా తీసుకురాగలం అని సెహవాగ్ సద్గురుని అడిగారు. దీనికి సద్గురు మాట్లాడుతూ, "వృత్తి విభజన వల్లనే కులవ్యవస్థ ప్రారంభమైంది. సమాజం పనిచేయాలంటే జనాభాలో కొంత మంది తప్పకుండా నైపుణ్యం గల చేతి వృత్తుల వారుండాలి. కొందరు వ్యాపారం చూడాలి, కొంత మంది పరిపాలన, కొంత మంది విద్యా, ఆధ్యాత్మికత నిర్వహించాలి. ఇలా వాళ్లు నాలుగు సామాన్య విభజనలు చేసారు.కాలక్రమంలో అవి ఇంకా ఇంకా విభజించబడ్డాయి. ఒక వివక్షగా కాదు కానీ పనిచేసేందుకు వీలుకోసం, అలాగే ప్రాచీన కాలంలో ఇంజినీరింగ్ లేదా వైద్య కళాశాలలు లేవనే విషయం అర్థం చేసుకోవాలి. మీ తండ్రి వడ్రంగి అయితే బాల్యం నుంచి మీరు ఇంటి దగ్గరే వడ్రంగి పని చెయ్యటం నేర్చుకొని మంచి వడ్రంగి కావచ్చు. ఈ కుల వ్యవస్థ ద్వారా ఈ నైపుణ్యాలు తరతరాలుగా వస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఈ విధానంలో ఎక్కడో కమ్మరి కంటే తాను గొప్పవాడి ననే ఆలోచన కంసాలిలో ప్రారంభమైంది.


కంసాలి కంటే కమ్మరి పని సమాజానికి చాలా అవసరమైన తాము ఇతరుల కంటే గొప్పవారం అనే భావన అలా కొందరిలో మొదలైంది. ఇలా తరాలు గడిచిన కొద్దీ ఈ ఆధిక్యత పాకుతూ పోయింది. అన్ని రకాల దోపిడీ ప్రక్రియలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా కులవ్యవస్థ దాదాపుగా వర్ణ వివక్షతలా మారుతోంది మారింది అనచ్చు. భారతదేశం లోని అనేక గ్రామాల్లో దళితులుగా పిలవబడుతున్న నిమ్న వర్గాలకు చెందిన ప్రజలకూ ఇప్పటికీ కనీస మానవ హక్కులు కరువయ్యాయి. గత పాతిక ముప్పై ఏళ్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నప్పటికీ మన దేశంలో ఇప్పటికీ అనేక ఘోరమైన అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీని నుంచి బయటపడే మార్గం ఏంటి, ఒకటి ఈనాడు ఇది అవసరం లేదు ఎందుకంటే నైపుణ్యాలన్నీ అనేక విధాలుగా నేర్పవచ్చు.



మనకు విద్యా సాంకేతిక సంస్థలున్నాయి. కుటుంబం ద్వారా మాత్రమే నైపుణ్యాన్ని అందించటం ఇక పనిచేయదు. కానీ, సామాజిక భద్రత కారణంగా కులవ్యవస్థ ఇప్పటికీ పనిచేస్తోంది. ప్రజలు తమ సొంత తెగ, కులం గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు. తమ కులంలో ఇబ్బందులున్న వారికి వారు బాసటగా నిలుస్తున్నారు. ఇటువంటి సామాజిక భద్రత ఉంది. మన దేశ వ్యాప్తంగా సామాజిక భద్రత వ్యవస్థను ఇంకా విద్యా వ్యవస్థను తీసుకు రావడం ప్రతి ఒక్కరికీ వాళ్ళ అభిరుచి ప్రకారం నైపుణ్యాలను అందించడం చాలా ముఖ్యం. ఇది జరిగినప్పుడు కులవ్యవస్థ సహజంగానే అంతమవుతుంది." అని సద్గురు వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: