నమ్మించి నట్టేట ముంచిన కిలాడి..పెళ్లిచేసుకుని అన్ని దోచుకుంది..

venugopal Ramagiri
కొందరికి ఓ విచిత్రమైన అలవాటు వుంటుంది.కనిపించిన వస్తువునల్లా కొట్టేయడం,అనే ఈ అలవాటు..కాని ఇది అలవాటు అనడం కన్నా వ్యాధి అనడం బెటర్.ఇక దొంగతనం చేయాలనిపిస్తే సాధారణంగా,ఏబస్సులోనో,రైల్లోనో,రోడ్డుపైనో,సినిమా హాల్లోనో చేస్తారు.కాని అంతరిక్షం దగ్గరి నుండి దొంగతనం చేయడం గురించి మీరెప్పుడైన విన్నారా. అంతరిక్షం నుండా అని ఆశ్చర్యపోకండి దోచుకోవాలనుకుంటే ఎక్కడినుండైన పని కానిచ్చేయవచ్చు.ఇంతకు ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం..



ఉత్తర అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)కు చెందిన ఓ వ్యోమగామి అంతరిక్ష కేంద్రం నుంచే తన జీవిత భాగస్వామి ఖాతాలో ఉన్న మొత్తండబ్బును కాజేసి,విచిత్రంగా వార్తల్లో నిలిచింది.ఆమె ప్రముఖ వ్యోమగామి అన్నె మెక్‌క్లాన్...ఈమె తొలి అంతరిక్ష నేరానికి పాల్పడిన మహిళగా వార్తల్లో నిలిచి పోయింది..ఫలితంగా నాసా ఆమెపై వెంటనే విచారణకు ఆదేశించింది. అయితే మెక్‌క్లాన్ మాత్రం తాను ఎటువంటి నేరం చేయలేదని చెబుతోంది.2014లో మెక్‌క్లాన్..సమ్మర్ ఉడెన్ అనే మరో మహిళను వివాహం చేసుకుంది.అయితే వీరిద్దరి మధ్య మనస్ఫర్థలు రావడంతో 2018లో వీరు విడిపోదామని నిర్ణయించుకున్నారు.




ఈ క్రమంలో వీరిద్దరు విడాకులు  కోరగా..అందుకు సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది.ఈ మధ్యలోనే మెక్‌క్లాన్‌కు ఈ దురాలోచన వచ్చింది.అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో..అంతరిక్షంలో ఉండగానే ఆమె తన భాగస్వామి ఉడెన్ ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం ఊడ్చేసింది.అయితే ఈ స్పేస్ స్టేషన్‌తో అమెరికాతో పాటు,కెనడా,జపాన్, రష్యా, యూరోపియన్ యూనియన్లకు కూడా సంబంధాలు ఉన్నాయి.అయితే ఏ దేశానికి చెందిన వ్యోమగామి ఐనా అంతరిక్ష నేరానికి పాల్పడితే..ఆ దేశం యొక్క నిబంధనల ప్రకారం వాళ్లను శిక్షిస్తారు.అయితే నాసా దీనిపై లోతుగా విచారణ చేసి నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత,మెక్‌‌‌క్లాన్‌ దోషి అని తేలితే భూమిమీదకు ల్యాండైన తర్వాత ఆమెపై చర్యలు తీసుకొనే అవకాశం ఉందని నాసా అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: